ఢిల్లీ పగ్గాలు కేంద్రం చేతిలోకి…

బిల్లు పాస్ కాకుండా యత్నం

నేడు ప్రవేశ పెట్టే అవకాశం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు కేంద్రం చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం మంగళవారం బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ఇందుకు సంబంధించిన బిల్లును ఈరోజు సభలో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర పెట్టేందుకు ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గవర్నమెంట్ ఆప్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 2023 బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రోజు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందినట్టయితే ఢిల్లీపై అధికారం అంతా కూడా కేంద్రం చేతుల్లోకి వెల్లనుండగా ఢిల్లీ ప్రభుత్వం నామ మాత్రంగా మిగిలిపోనుంది. ఈ ఆర్డినెన్స్ బిల్లును విపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించాలని నిర్ణయించుకుని రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రాజ్యసభ సభ్యులకు ఆయా పార్టీలు విప్ కూడా జారీ చేయగా, బీఆర్ఎస్ పార్టీ కూడా విప్ జారీ చేసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. దీంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించుకోవడంపై ఉత్కంఠత నెలకొందనే చెప్పాలి.

You cannot copy content of this page