డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంటున్న భారత్

డ్రగ్స్ కోరల్లో భారత భవిష్యత్తు చిక్కుకపోయింది. మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో విఫలం అవుతున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి తయారైందని చెప్పవచ్చు. దేశ ఔన్నత్యాన్ని చాటేందుకు ముందుకు సాగాల్సిన నేటి తరం దారి తప్పుతుండడం ఆందోళనకరంగా మారింది. యువతపైనే ఆశలు పెట్టుకుని వారే దేశ భవిష్యత్తుగా భావిస్తున్న నేటి పరిస్థితుల్లో కీలకమైన దశలో వారు దారి తప్పుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం గురించి ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బిల్లీ బాట్వెర్ వెల్లడించిన విషయం భారత్ ను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. దేశంలో డ్రగ్ బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండడమే కాకుండా ఈ ఊబీలో చిక్కుకుంటున్న వారి ఏజ్ కూడా ఆందోళనకరంగా ఉంది. డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిలో 13శాతం మంది 20 ఏళ్ల లోపు వారేనని ఐరాస ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. కౌమరదశలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని మాఫియా చేస్తున్న చర్యలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఈ నివేదికలు హెచ్రిస్తున్నాయి. హింస, దోపిడీ, లైంగిక వేధింపులు, మానసిక, శారీరక ధృడత్వంగా లేకపోవడం వల్ల పిల్లలు డ్రగ్స్, ఆల్కహాల్ వైపు ఆకర్షితులువుతున్నారని బిల్లీ బాట్వెర్ ప్రకటించారు. ప్రతి 10 మందిలో 9 మంది 18 ఏళ్ల లోపున ఉన్న వారే డ్రగ్స్ లేదా అల్కహాల్‌కు అలవాటు అవుతున్నారన్నారు. సామాజిక-ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటుండడం వంటి కారణాల వల్లే చిన్నారులు అటుగా వెల్తుండడానికి ప్రధాన కారణమని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వారు యవ్వనంలోకి అడుగు పెట్టే ముందే మాదక ద్రవ్యాల బారిన పడుతుండడం అత్యంత ప్రమాదకరమన్న విషయాన్ని పాలకులు గుర్తించి కఠిన నిర్ణయాలు తీసుకోవల్సిన ఆవశ్యకత అయితే ఉందని ఐరాస నివేదికలు తేల్చి చెప్తున్నాయి.

You cannot copy content of this page