బంగ్లాదేశ్ హిందువుల కోసం ప్రత్యేక కమిటీ…

దిశ దశ, జాతీయం:

బంగ్లాదేశ్ పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న హిందువుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. అక్కడ నివిస్తున్న హిందువుల భద్రత కోసం ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వేసిన ఈ కమిటీ బంగ్లాదేశ్ హిందువులను రక్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉన్నత స్థాయి కమిటీలో ఏడీజీ, సరిహద్దు భద్రతా దళం, తూర్పు కమాండ్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. తమ కౌంటర్ పార్ట్ అధికారులతో కమ్యూనికేషన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలని భావిస్తోంది.

You cannot copy content of this page