ఇన్‌ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో హెచ్ 3ఎన్ 2 వైరల్ ఇన్ ప్లుయెంజా కేసులు విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇన్‌ ఫ్లుయెంజా వైరస్‌తో చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా హెచ్ 3ఎన్2 వైరస్ ఇన్ ప్లుయోంజాతో భారత్‌లో రెండు మరణాలు సంభవించాయి. కర్ణాటక, హర్యానాలో ఒక్కో మరణం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల హీరే గౌడ్ ఇన్ ప్లుయెంజాతో మరణించినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది హెచ్ 1ఎన్ 1 వైరస్ కేసులను గుర్తించాయి. కర్ణాటకలో తొలి ఇన్ ప్లుయెంజా మరణం చోటు చేసుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ తరహా లక్షణాలనే పోలిన ఈ ఇన్ ప్లుయెంజా కేసులు పెరిగాయి. ఒక వేవ్ తరహాలో చాలా ప్రాంతాలకు ఈ ఇన్ ప్లుయెంజా పాకింది. ఇందులో చాలా వరకు హెచ్3ఎన్2 వైరస్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్‌ను కాంగ్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. ఇతర ఇన్ ప్లుయెంజా సబ్ టైపుల్లో ఈ హెచ్ 3ఎన్2 వైరస్ ఎక్కువ మందికి సోకుతుంది.

ఇన్ ప్లుయెంజా బారిన పడిన వారిలో దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఊపిరి ఇబ్బందిగా తీసుకోవడం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు కనపిస్తున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, స్నీజింగ్, సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్‌ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని.. అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఇన్ ఫ్లుయెంజా కేసులు వేగంగా వ్యాప్తంగా చెందుతున్నాయని అధికారులు తెలిపారు.

You cannot copy content of this page