తాజాగా మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు విచారణకు రావాలని పిలిచాయంటే చాలు అరెస్ట్ ఖాయం అన్నట్టుగా తయారైంది. ఈ స్కాంతో సంబంధం ఉందన్న వారికి నోటీసులు ఇవ్వడం వారిని విచారించి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. ఇప్పటి వరకు జాతీయ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన వారిలో చాలామందిని ఇదే పద్దతిని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండో సారి విచారించేందుకు రావాలని పిలిచి అరెస్ట్ చేయడం గమనార్హం. ఏకంగా డిప్యూటీ సీఎంనే అరెస్ట్ చేశారంటే దర్యాప్తు సంస్థల దూకుడు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నోటీసులంటే హడల్…
ఇకపోతే జాతీయ దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ విచారణకు రావాలని పిలిచిదంటే చాలు అరెస్ట్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది కూడా విచారణకు వెల్లి అరెస్టయ్యారు. ఇటీవల కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కాంను మరింత స్పీడ్ గా దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థల టార్గెట్ నెక్స్ట్ ఎవరన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట రాఘవను అరెస్ట్ చేయగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత పేరు ఛార్జిషీట్లో పలుమార్లు ఉండడం గమనార్హం. దీంతో ఖచ్చితంగా జాతీయ దర్యాప్తు సంస్థల టార్గెట్ కవితే ఉంటుందన్న ప్రచారం ఆదివారం రాత్రి నుండి జరుగుతోంది. అయితే ఇప్పటి వరకైతే కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి ఎలాంటి నోటీసులు మాత్రం రెండో సారి రాలేదు. కానీ ఆమెకు వస్తే నోటీసులు జారీ అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే జాతీయ దర్యాప్తు సంస్థల నెక్స్ట్ టార్గెట్ ఎవరోనన్నదే హాట్ టాపిక్ అయింది.