రాములోరి సన్నిధిలో తెలుగు రాతలు…

దిశ దశ, జాతీయం:

శ్రీ రాముని సన్నిధిలో ఏ వీధిలో చూసిన తెలుగు భాష కూడా కనిపించబోతోంది. జనవరి 22న ప్రారంభం కానున్న శ్రీరామని ఆలయాన్ని సందర్శించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశాలు ఉన్నాయని ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. శ్రీరామ జన్మభూమిని దర్శించుకుని తరించిపోవాలని భావించే భక్తుల కోసం కేవలం జాతీయ భాషలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన భాషల్లోనూ సూచికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తెలుగు భాషలో కూడా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన ఆలయంతో పాటు ఇతర సందర్శనీయ స్థలాలకు సంబంధించిన బోర్డులను తెలుగు భాషాలో కూడా రాయించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భాష రాక తాము చూడాల్సిన ప్రదేశాలకు వెల్లలేక ఇబ్బందులు పడకుండా ఉంటారని భావిస్తున్నారు.

You cannot copy content of this page