అంతర్జాతీయంగా సేవలందించేందుకు కూడా పోస్టల్ విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ఓ వైపున పొదుపు ఖాతాల తెరవడం మరో వైపున బట్వాడా విధానాన్ని మెరుగు పర్చడంపై పోస్టల్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా అంతర్జాతీయంగా సరుకుల ఎగుమతి చేయడం ఆరంభించింది. డాక్ ఘర్ నిర్యత్ కేంద్రాన్ని ప్రత్యేకంగా కరీంనగర్ పోస్టాఫీసులు ఏర్పాటు చేశామని పోస్టల్ ఎస్సీ వై వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. తక్కువ ఖర్చుతో విదేశాలకు వస్తువులను పంపించేందుకు ప్రత్యేకంగా ఈ విధానం ప్రారంభించామన్నారు. విదేశాలకు వస్తువులు, తిను బండారాలు, మందులు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఇతర సామాగ్రిని ఎక్స్ పోర్ట్ (ఎగుమతి) చేసే సంస్థల కోసం ప్రత్యేకంగా డాక్ ఘర్ నిర్యత్ కేంద్రాన్ని (డిఎన్కే) ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇంపొర్టు అండ్ ఎక్స్ పోర్టు లైసెన్స్ కష్టమర్ (ఐఇసీ) కోడ్ కలిగిన సంస్థలు ఈ డీఎన్కే ద్వారా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఫ్రీ హోం పికప్ తోపాటు అతి తక్కువ ధరలో పార్సిల్ ప్యాకేజింగ్ యూనిట్ ద్వారా ప్రత్యేకంగా ప్యాక్ చేయడం జరుగుతుందని వివరించారు. ఎగుమతిదారులు తమతమ కార్యాలయాల నుండే వివరాలను అందించిన సాఫ్ట్ వేర్ లో డైరెక్ట్ గా పోస్టాఫీస్ నిర్యత్ కేంద్రంలో అందించవచ్చన్నారు. కస్టమ్స్ చెకింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని, త్వరగా విదేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. ఇందుకోసం కరీంనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో డాక్ ఘర్ నిర్యత్ కేంద్రాన్ని (డిఎన్కే) ఏర్పాటు చేశామని, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే సంస్థలు, విదేశాలకు వస్తువులు పంపించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు కోరారు.
Disha Dasha
1884 posts
Prev Post