కాంగ్రెస్ పార్టీ అ పని చేస్తుండడంతో పార్టీ పరువు రోడ్డున పడింది…కరీంనగర్ ఉద్యమకారుడి రాజీనామా…

దిశ దశ, కరీంనగర్:

బీఆర్ఎస్ పార్టీకి మరో ఉద్యమ కారుడు కూడా బైబై చెప్తున్నానని ప్రకటించారు. ఇటీవల కరీంనగర్ నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ లో ఉద్యమ కారులకు గుర్తింపు లేకుండా పోయిందని కామారపు శ్యాం నాయకులను నిలదీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఉద్యమ కారుడు ఏకంగా ఉద్యమ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీంతో ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లాలోనే గులాభి నాయకత్వానికి వ్యతిరేక పవనలు మొదలయ్యాయి. కొత్తపల్లి మండలం ఎలగందుల ఎంపీటీసీ సభ్యుడు, సుడా డైరక్టర్ మంద రమేష్ గౌడ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. 2001లో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం నుండి కూడా తాను గులాభి జెండా నీడనే కొనసాగానన్నారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ కబ్జా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తుండడంతో పార్టీ పరువు అంతా రోడ్డున పడిపోయిందన్నారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు అందలం ఎక్కించడం తనను బాధించిందన్నారు. ప్రజాభిమానం చురగొన్న పార్టీలోకి భూ కబ్జా దారులను, తప్పుడు పనులు చేసే వారిని, అవినీతి పరులను, అక్రమ నిర్మాణ దారులను తీసుకరావడంతో పాటు వారికి స్థానిక నాయకత్వం అండగా ఉన్నారన్నారు. అంతే కాకుండా స్థానిక నాయకత్వం వారిని ప్రోత్సహించడంతో అధికారులను భయ భ్రాంతులకు గురి చేస్తూ పార్టీని భ్రష్టు పట్టించారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఎంతో అభిమానం ఉన్న పార్టీని అభాసు పాలు చేసిన తీరును చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు. అంతేకాకుండా ఉద్యమకారులను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి సీఎం ఉద్యమ కారులకు గుర్తింపునిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా రమేష్ ఆ లేఖలో వెల్లడించారు.

You cannot copy content of this page