బ్యారేజీ కన్నా భారీ చెక్ డ్యాం అయితే బెటర్..?

మేడిగడ్డపై సరికొత్త ప్రతిపాదన…

దిశ దశ, భూపాలపల్లి:

ప్రస్తుతం శిథిలమయిపోతున్న బ్యారేజీని పూర్తిస్థాయిలో పునరుద్దరించడం అసాధ్యం… ఒక వేళ మరమ్మత్తులు చేసినా ఇప్పటికే జరిగిన డ్యామేజీ ప్రభావంతో 7వ బ్లాకుతో పాటు మరో రెండింటిని సమూలంలగా మార్చాల్సిందే… అయినా మిగతా బ్లాకులు కూడా రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు… మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ అధికారులు నిర్థారణకు వచ్చిన విషయం ఇది.

మూడింటిని తొలగించినా…

మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకులో పిల్లర్లు కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం 6, 8 బ్లాకులపై కూడా పడింది. దీంతో మూడు బ్లాకులలని 34 పిల్లర్లను తొలగించాల్సిన వస్తోందని, వీటికి 3.40 లక్షల కాంక్రీట్ అవసరం పడుతుంగా, పిల్లర్లు, రాఫ్ట్ ల కోసం 9 లక్షల 15 వేల 64 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరం ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఇందులో నాలుగు డబుల్ పిల్లర్లు కూడా ఉండగా… ఒక్కో పిల్లర్ కు 50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరం ఉంటుందని గుర్తించారు. 7వ బ్లాకు 211 మీటర్లు, 8వ బ్లాకు 208 మీటర్లు, 6వ బ్లాకు 230 మీటర్ల పొడవున నిర్మించారు. మొత్తం బ్యారేజ్ 1627 మీటర్ల పొడవు ఉండగా అందులో 650 మీటర్ల పొడవు వరకు ఉన్న 6,7.8వ బ్లాకులను సమూలంగా తొలగించి కొత్తవి నిర్మించాల్సి వస్తోంది. దీనికి సుమారు రూ. 3 వేల కోట్ల పై చిలుకు నిధులు అవసరం పడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ బ్యారేజీకి రూ. 4200 కోట్ల మేర నిధులు వెచ్చించగా, ఇప్పుడు మార్చాల్సిన మూడు బ్లాకులను కూల్చి కొత్తవి నిర్మించేందుకు రూ. 3 వేల కోట్లకు పైగా అవసరం అవుతున్నాయి. అంటే దాదాపు కొత్త బ్యారేజీకి చాలినన్ని నిధులు ఇందు కోసమే ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. వీటిని కూడా డైమండ్ కటింగ్ విధానంలో కాకుండా డ్రిల్లింగ్ కం బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ అధికారులు తేల్చినట్టు సమాచారం. రూ. 3 వేల కోట్ల వరకు నిధులు వెచ్చించి మూడు బ్లాకులను పునర్నిమాణం చేసినా మిగతా బ్లాకులు కూడా భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయానికి కూడా వచ్చినట్టు సమాచారం. అలాగే బ్యారేజీ రాప్టర్ ఏరియాలో 3.40 లక్షల కాంక్రీట్ వినియోగించారని గుర్తించారు. అక్కడ కూడా మొత్తుం వరదలకు కొట్టుకపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వీర్ మెకానిజం ద్వారా భారీ సైజు చెక్ డ్యాంలా మేడిగడ్డను మార్చినట్టయితే 2 నుండి 3 టీఎంసీల నీటిని నిలువ ఉంచే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు.

అప్రమత్తం చేసినా…

అయితే బ్యారేజ్ నిర్మాణాన్ని ఖరగ్ పూర్ ఐఐటీ నిపుణులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసినప్పుడు లోపాలను ఎత్తి చూపినట్టుగా తెలుస్తోంది. వరధ ఉధృతిని అంచనా వేయకుండా నిర్మాణం జరిపారని భవిష్యత్తులో డ్యాం డ్యామేజీ అవుతుందని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఐఐటీ నిపుణులు ఈ సూచనలు చేసి వెల్లిన తరువాత గోదావరి నదిలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చింది. అప్పుడే బ్యారేజీకి ఏమీ కాలేదని గమనించిన అధికారులు ఇక ముందు కూడా ఢోకా ఉండదని నిర్ధారణకు వచ్చి కొన్ని సాంకేతికపరమైన అంశాలను విస్మరించారన్న వాదనలు కూడా లేవనెత్తినట్టు సమాచారం. అయితే భారీగా వచ్చిన వరదలతో ప్రారంభం అయిన డ్యామేజీ క్రమక్రమంగా విస్తరించడంతో బేస్ ప్రాంతంలోని కాంక్రీట్ తో పాటు ఇతరాత్ర అంతా కూడా కొట్టుకపోయినట్టుగా తెలుస్తోంది. వాస్తవంగా వర్షాకాలానికి ముందు, తరువాత ఖచ్చితంగా బ్యారేజీల పరిస్థితిని కులంకశంగా పరిశీలించినట్టయతే ఈ లోపాలు వెలుగులోకి వచ్చేవి కానీ ప్రీ మానుసూన్, పోస్ట్ మనుసూన్ ఇన్సెపెక్షన్ విధానాన్నే ఇంజనీర్లు పక్కనపెట్టేశారని కూడా విజిలెన్స్ అధికారుల ఆరాలో తేటతెల్లం అయింది. అయితే ఈ రిపోర్టులను విధిగా స్టేట్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పంపించినట్టయితే వారు సిడబ్లూసికి పంపించడం ఆనవాయితీ. కానీ ఎలాంటి చొరవ తీసుకోనట్టుగా తెలుస్తోంది.

ఒక్క మేడిగడ్డ పరిస్థితే…

అయితే విజిలెన్స్ అధికారులు ఒక్క మేడిగడ్డ బ్యారేజీని స్టడీ చేసిన తరువాత నిర్దారణకు వచ్చిన విషయాలే ఈ విధంగా ఉన్నాయి. మరో రెండు బ్యారేజీలను కులంకశంగా పరిశీలించాల్సి ఉండగా, మూడు పంప్ హౌజ్ ల పరిస్థితిపై కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. ఆయా పంప్ హౌజ్ ల మోటార్లు గోదావరి నీటి మట్టానికి దిగువన ఏర్పాటు చేయడం వల్లే వరదల్లో మునిగిపోయాయని ఇప్పటికే అధికారులు నిర్ధారణకు వచ్చారు. కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంప్ హౌజ్ లను, బ్యారేజీలను పరిశీలించినట్టయితే ఎన్ని లోపాలు వెలుగులోకి వస్తాయోనన్న చర్చ కూడా సాగుతోంది.

You cannot copy content of this page