దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్… ట్రాకింగ్ వ్యవహారం విషయంలో అప్పటి పోలీసు అధికారులు తల్చుకున్న వెంటనే తమ టార్గెట్ ఎలా రీచ్ అయ్యారు..? లెక్కకు మించిన ఫోన్ నంబర్లను ట్రేస్ చేయడానికి వీరు ఎంచుకున్న మార్గం ఏంటన్నదే పజిల్ గా మారింది. వాస్తవంగా చీఫ్ సెక్రటరీ లెటర్ ఇస్తేనే టెలికాం సర్వీసులు పంపించే లింక్ ద్వారా 15 నంబర్లు మాత్రమే అబ్జర్వేషన్ లో ఉంచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వాట్సప్ ఛాట్స్ ను గమనించినా… డిసెంబర్ 4న ఎస్ఐబీ కార్యాలయంలో దగ్దం చేసిన పేపర్లతో పాటు హార్డ్ డిస్కుల సంఖ్యను గమనించినా… వేల సంఖ్యలో మొబైల్ నంబర్ల డాటా సేకరించి ఉంటారని స్పష్టం అవుతోంది. ఎస్ఐబీ కార్యాలయంతో సంబంధం లేకుండా రెండు ప్రత్యేక గదుల్లో 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని ఈ డాటా సేకరించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ సిస్టమ్స్ కు అమర్చిన హార్డ్ డిస్కుల్లో టెరా బైట్స్ (టి.బి)ల్లోనే డాటా ఉంటుందని స్ఫష్టం అవుతోంది. వీటిని బట్టి స్పెషల్ ఆపరేషన్ వింగ్ ఏ స్థాయిలో ట్యాపింక్, ట్రాకింగ్ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ నంబర్లను ట్రాక్ చేయడం కోసం పోలీసు అధికారులు అడిగే నంబర్లు విద్రోహ శక్తులవి కానీ ఇతరాత్ర బలమైన కారణాలు ఉన్న వారివి అయితేనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోలీసు అధికారులు అడిగిన వెంటనే సీఎస్ అన్ని మొబైల్స్ కు సంబంధించి ట్యాపింగ్ చేసేందుకు లింక్స్ పంపించాలని లేఖ రాసి ఉంటారా..? సీనియర్ ఐఏఎస్ అధికారులు వారికి అనుగుణంగా వ్యవహరించే అవకాశం ఉంటుందా అన్నది కూడా అంతుచిక్కకుండాపోతోంది. ఎస్ఐబీ అధికారులు సేకరించిన డాటాను టీబీల్లో ఉండడాన్ని గమనిస్తే అన్నిఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్ కు అవసరమైన లింక్స్ ఇవ్వాలని కోరుతూ సీఎస్ సదరు టెలికాం సర్వీసులకు లేఖలు ఎన్ని రాసి ఉంటారు..? అన్ని లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నేరుగా పంపించే అవకాశం ఉంటుందా అన్నదే మిస్టరీగా మారింది. తరుచూ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్న తీరును గమనించి సీఎస్ లు కూడా అభ్యంతరాలు చెప్పే అవకశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యంగ విరుద్దంగా పోలీసులు వ్యవహరించినట్టయితే బండారం అంతా బట్టబయలు అయినప్పుడు తాము కూడా చిక్కుల్లో పడాల్సి వస్తుందని భావించే అవకాశం లేకపోలేదు. ఒక వేళ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా లేఖలు ఇవ్వాలని ఆదేశించినట్టయితే సీఎస్ లు లేఖలు ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు. లేనట్టయితే చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇతన అధికారులకు కొన్ని విషయాల్లో ‘ఫర్’ అని సిగ్నచర్ చేసే అధికారం ఉంటుంది. అలాంటి వారిచే ఈ లేఖలు రాశారా.? లేదా మొదట పోస్ట్ చేసిన మెయిల్ ఐడీ నుండే రెగ్యూలర్ గా టెలికం సర్వీసులకు రిక్వెస్ట్ లెటర్స్ పెట్టారా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. అయితే ఇలా కూడా వ్యవహరించినట్టయితే తెలంగాణ ప్రభుత్వం నుండి పదేపదే ట్యాపింగ్ కోసం లేఖలు వస్తున్నాయన్న విషయాన్ని సంబంధిత టెలికాం సర్వీసుల ప్రతినిధులు ట్రాయ్ కి కానీ, కేంద్ర హోంశాఖకు కానీ సమాచారం ఇచ్చారా లేదా అన్న కోణంలో ఆరా తీయాల్సి ఉంది. మరో వైపున ట్యాపింగ్ కోసం తరుచూ లింక్స్ తెప్పించుకుంటున్న క్రమంలో ఇందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ మూలాలను క్యాచ్ చేసి డైరక్ట్ గా ఫోన్ నంబర్లపై వాచింగ్ చేయడం ఆరంభించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీని సీక్రెట్ గా తెప్పించుకుని ట్యాపింగ్ కు పాల్పడి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అడ్వాన్స్ టెక్నాలజి కారణంగానే వాట్సప్ తో పాటు ఇతర యాప్స్ ద్వారా మాట్లాడుకున్న అంశాలు కూడా ఎస్ఐబీలో రికార్డు అవుతున్నాయని అధికారులు, పొలిటికల్ పార్టీల నాయకులు బలంగా వమ్మేవారు. ఒక్క ఐఫోన్ ద్వారా ఫేస్ యాప్ లో మాట్లాడినప్పుడు మాత్రమే స్వేచ్ఛగా ఉండేవారని తెలంగాణ అంతటా బహిరంగంగానే సాగిన చర్చ. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన మిషన్ ను గుట్టు చప్పుడు కాకుండా దిగుమతి చేసుకున్నారా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. అంతేకాకుండా వాట్సప్ ఛాట్స్ ను గమనిస్తే ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్లను అబ్జర్వ్ చేస్తూ డాటా సేకరించినట్టుగా అర్థమవుతోంది. ఒకవేళ టెలికాం సర్వీస్ ద్వారా ట్యాపింగ్ చేసేందుకు అవసరమైన లింక్ తెప్పించుకోవాలంటే ప్రాసెస్ కంప్లీట్ కావడానికి గంటల వ్యవధి అయితే పడుతుంది. అంతలో వీరు ట్రాకింగ్, ట్యాపింగ్ చేసిన మొబైల్ నంబర్లు వినియోగించిన వారు సేఫ్ జోన్ లోకి వెల్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. వెంట వెంటనే సమాచారం అప్ డేట్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు వారి గురించి ఆరా తీయాలి తప్ప సీఎస్ ద్వారా లేఖలు రాసిన తరువాత ఆయా సంస్థల నుండి వచ్చే లింక్స్ కోసం ఎదురు చూసినట్టుగా మాత్రం అనిపించడం లేదు దీంతో దీని వెనక ఏదో మర్మం దాగి ఉంటుందని స్పష్టం అవుతోంది.
మౌనమే సమాధానామా..?
అయితే ఆదివారం ఉదయం చంచల్ గూడ జైలు నుండి కస్టడీకి తీసుకున్న పోలీసు అధికారులు ఆయన్ను విచారించడం ప్రారంభించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిలతో పాటు స్పెషల్ టీమ్ రహస్య ప్రాంతంలో ప్రణిత్ రావును ప్రశ్నిస్తోంది. ఎస్ఐబీ కార్యాలయంలో హార్డ్ డిస్కుల గల్లంతుతో పాటు పెన్ డ్రైవ్స్, కంప్యూటర్స్ కు సంబంధించిన అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. పోలీసు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మౌనమే నా సమాధానం అన్నట్టుగా ప్రణిత్ రావు వ్యవహరిస్తున్నారని సమాచారం. ప్రణిత్ రావు వినియోగించిన మొబైల్ ఫోన్లను రిట్రైవ్ చేయడం పూర్తయిన నేపథ్యంలో పూర్తి వివరాల కోసం ఫోరెన్సిక్ లాబోరేటరికి పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఇద్దరు సీఐలు ప్రణిత్ రావుతో చేతులు కలిపారని ప్రాథమికంగా నిర్దారించిన ఉన్నతాధికారులు వారిని వివరించేందుకు కూడా సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం.