Kumbh Mela: ప్రయాగ రాజ్ ప్రయాణం… ప్రయాసలతో కూడిన యాణం…

దిశ దశ, జాతీయం:

కుంభ మేళ… ఇప్పుడి ఉత్సవాలు అంతర్జాతీయంగా ట్రెండింగ్ లో ఉంది. దేశ, విదేశాల నుండి కోట్ల సంఖ్యలో ప్రయాగ రాజ్ వెల్లతున్నారు. సాధు సంతులు, నాగ సాధులు, అఘోరీలు ఇలా సర్వసంగ పరిత్యాగం చేసిన వారు మత్రమే దశాబ్దాల క్రితం ప్రయగా రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేవారు. 12 ఏళ్ల కోసారి వచ్చే ఈ కుంభ మేళ పురస్కర్కించుకుని వేల సంఖ్యలో సాధువులు ప్రయాగ రాజ్ చేరుకునే వారు. కీకారణ్యాలు, హిమాలయాల్లో నివసించే సాధువులు మాత్రమే గతంలో కుంభ మేళ సందర్భంగా ప్రయాగ రాజ్ వెల్లేవారు. క్రమ క్రమంగా కుంభ మేళ గురించి ప్రాచూర్యంలోకి రావడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు కోట్ల సంఖ్యలో జనం తరలి వెల్తున్నారు. దేశంలోని దారులన్ని ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్టుగా సాగుతోంది.


ఓ టోల్ గేట్ వద్ద పరిస్థితి ఇది…

ప్రయాణంలో ప్రయాస…

ఒక్కో రోజు 30 నుండి 40 కోట్ల వరకు జనం ప్రయాగ రాజ్ కు చేరుకుంటుండడంతో ఈ ప్రాంతానికి వెల్లే రహదారులన్ని కూడా వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి ప్రయాగ రాజ్ వద్ద వందలాది ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి వరకు చేరుకోవడానికే కష్టాలు పడుతున్నారు జనం. ప్రైవేటే వాహనాల్లో వెల్తున్న వారి కష్టాలయితే అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. తెలంగాణ, ఎపీ, చత్తీస్ గడ్, మహారాష్ట్రలోని విదర్భ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రయాగ రాజ్ కు వెలుతున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. 15 నుండి 18 గంటల పాటు ప్రయాణం చేస్తే ప్రయాగ రాజ్ చేరుకోవల్సి ఉన్నప్పటికీ మార్గ మధ్యలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో రోజుల కొద్ది చిక్కుకపోతున్న పరిస్థితి తయారైంది. మౌని అమవాస్య తరువాత తగ్గు ముఖం పడుతుందని అంచనా వేసినప్పటికీ ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతుండడంతో వాహనాలు మార్గ మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తోంది.

బడలికను వదిలేసి… బిడ్డను బుజ్జగించాల్సిందే ఇలా మరి…

30 k.m. @ 7 గంటలు…

నాలుగు, ఆరు లేన్ల రహదారులు ఉన్నప్పటికీ వాహనాలతో కిక్కిరిసి పోవడంతో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ సరిహధ్దుల్లోకి చేరిన తరువాత కూడా ట్రాఫిక్ సమస్య ఎదురవుతూనే ఉంది. దీంతో వాహన దారులు గమ్యం చేరడానికి నరకయాతన పడుతున్నారు. శనివారం మద్యాహ్నం మాధికల టోల్ గేట్ సమీపంలో వాహనాలు నిలిచిపోవడంతో బస్సుల్లో వెల్తున్న వారు సమీపంలోని పంట చేలల్లో వంటలు చేసుకోవల్సిన పరిస్థితి తయారైంది. మహిళలు రిప్రెష్ కావడానికి సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాగ రాజ్ కు 80 కిలో మీటర్ల దూరంలోని మద్దికల వద్దకు శనివారం మద్యాహ్నం చేరుకున్న వారు 30 కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి 7 గంటల సమయం పట్టిందంటే ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాహనాలు నడపలేక ప్రయాణిక బడలికతో చెక్కా ఘట్ వద్ద ఉన్న హోటల్స్ అద్దెకు తీసుకుని రెస్ట్ తీసుకోక తప్పనిసరి పరిస్థితి తయారైంది. మరోవైపున మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ప్రయాగ రాజ్ కు 70 కిలో మీటర్ల దూరంలోనే ఫోర్ వీల్ వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇక్కడి నుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని గమ్యం చేరుకోవల్సిందే తప్ప మరో గత్యంతరం లేకుండా పోయిందని ప్రయాగ రాజ్ కు వెల్తున్న వారు చెప్తున్నారు. 70 కిలో మీటర్ల దూరంలో వాహనాలను పార్కింగ్ చేసి తమ లగేజీలు తీసుకుని ప్రయాగ రాజ్ చేరుకోవడం ఎలా అనేదే తేల్చేకోలేక సతమతమవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారంటే కుంభ మేళకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయో గమనించవచ్చు.


ప్రయాగ రాజ్ ఘాట్ పార్కింగ్ కాదిది… 70 కిలో మీటర్ల దూరంలో ఆగిన వాహనాలివి

You cannot copy content of this page