సప్త వర్ణ శోభితమా… పార్టీ బ్రాండ్ కే ప్రాధాన్యమా..?

హోలి అంటేనే రంగోళి అని అంటుంటాం. కానీ పొలిటికల్ పార్టీలు మాత్రం వివిధ రంగులు కాదు… పార్టీ కలర్స్ తో మాత్రమే తమ కేళీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సహజత్వానికి మారుపేరుగా నిలిచే పర్వదినాల్లో ఒకటైన హోలీ పండుగ రోజున ఆయా పార్టీల నాయకులు చల్లుకున్న రంగులను గమనిస్తే ఔరా అనాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందంటే…

బీజేపీ ఇలా…

భారతీయ జనతాపార్టీ ఆద్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాతో పాటు పలు ప్రాంతాల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కొంతకాలంగా నిర్వహిస్తున్న ఆనవాయితీ ప్రకారం ఈ సారి కూడా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు సంజయ్ కి ఈ సందర్భంగా పర్వ దిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంబరాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ కూడా అందరితో కలివిడిగా ఉంటూ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం సప్త వర్ణాల జోలికి మాత్రం వెల్లలేదు. తమ పార్టీ బ్రాండ్ అయిన కాషాయం రంగును మాత్రమే వినియోగించారు. బీజేపీ క్యాడర్ ఎక్కడ పాల్గొన్నా కూడా కాషాయం మాత్రమే వాడాలన్న సంకేతాలు వెల్లాయో లేక ఒక్క కలర్ మాత్రమే వాడాలని శాసనం చేశారో తెలియదు కానీ బీజేపీ సంబరాల్లో 95 శాతం మంది ఆ రంగుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

బీజేపీ హోలీ సంబరాల్లో స్టేట్ చీఫ్ బండి సంజయ్

బీఆర్ఎస్ అలా…

ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తామేమీ తీసిపోమన్నట్టుగా వ్యవహరించారనే చెప్పాలి. కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వలో హోలి సంబరాలు అంబరాన్ని తాకాయి. పార్టీ క్యాడర్ తో పాటు వివిధ వర్గాల ప్రజలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఆడి పాడారు. వేల సంఖ్యలో మంత్రి చుట్టూ ఉన్న ఒక్కరు కూడా గులాభేతర రంగు జోలికి వెల్లకపోవడం గమనార్హం. కరీంనగర్ తెలంగాణ చౌక్ తో పాటు పలు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ హోలీ ఆడినప్పటికీ పార్టీ బ్రాండ్ కలర్ ను మాత్రం వీడలేదు.
బీఆర్ఎస్ శ్రేణులన్ని కూడా గులాభిమ రంగు మాత్రమే చల్లుకుంటూ హోలీ ఆడుకున్నారు.

బీఆర్ఎస్ సంబరాల్లో గంగుల కమలాకర్

సప్తవర్ణాలేవో…?

అయితే రెయిన్ బో కలర్స్ కు ప్రతీకగా నిలిచే హోలిలో అన్ని రంగులతో ఆట ఆడాల్సింది పోయి కేవలం తమ పార్టీ బ్రాండ్ కలర్స్ మాత్రమే వాడడం వెనక ఆ పార్టీ నేతల ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సనాతన సాంప్రాదాయ బద్దంగా సాగుతున్న హోలిని కూడా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కలర్స్ కే పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఇతిహాసాలు, భారతీయత్వం గురించి ప్రజలకు వివరించే బీజేపీ కేవలం కాషాయానికే పరిమితం కావడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. మరో వైపున బీజేపీ లక్ష్యంగా జాతీయ పార్టీ వైపు అడుగులు వేసిన బీఆర్ఎస్ కూడా సప్తవర్ణాల జోలికి వెల్లకుండా తమ పార్టీ రంగుకే పరిమితం కావడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ప్రతి అంశాలోనూ బీజేపీని తూర్పార పడుతున్న బీఆర్ఎస్ మరి హోలీ రంగులు చల్లుకునే విషయంలో మాత్రం ఆ పార్టీ మాదిరిగానే తమ పార్టీ రంగుకే ఎందుకు పరిమితం అయిందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయంగా ఉండాలని కోరుకోవాలని కానీ తమ పార్టీ రంగులకే పరిమితమై పర్వదినాన్ని కూడా తమ బ్రాండ్ కోసం వినియోగించుకోవడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page