సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ వెనుక అసలు కారణం అదేనా..?

యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాజకీయల నుంచి ఇక తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొన్న సోనియా గాంధీ.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. రాజకీయాలు ఇక చాలు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోనియా గాంధీ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అని, ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం సంతోషకరమని సోనియా గాంధీ తెలిపారు. పేదల కోసం పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు.

భారత్ జోడో యాత్ర దేశాన్ని మలుపు తిప్పిన యాత్ర అని సోనియా గాంధీ చెప్పారు. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2004 నుంచి 2009 వరకు సాధించిన విషయాలు తనకు ఏంతో సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి కడా ఇది సవాల్ వంటి సమయమన్నారు.

దేశంలోని ప్రతి వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. అయితే సోనియా గాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడానికి అనారోగ్య సమస్యలే కారణమని చెబుతున్నారు. సోనియా ఇప్పటికే అనేక అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. పలుమార్లు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో కూడా చికిత్స పొందుతన్నారు. పలుమార్లు విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు, వయస్సు రీత్యా తప్పుకోవడమే మంచిదనే భావనకు సోనియాగాంధీ వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి,. ప్లీనరీ సమావేశాల్లో చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ వర్గాలు ఖంగుతిన్నాయి. సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటే రాహుల్ పార్టీని నడిపించగలడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

You cannot copy content of this page