గురు శిష్యుల మధ్య వార్ పాతదేనా..?

దిశ దశ, వరంగల్:

వరంగల్ లోకసభ స్థానంలో గురు శిష్యుల మధ్య ప్రత్యక్ష్య పోరు సాగుతుండడం ఓ స్పెషాలిటీ అని చెప్పాలి. ఏరా అనగానే సార్ అనేంత చనువు ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య లోకసభ ఎన్నికలు ప్రచ్ఛన్న యుద్దాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇంతకాలం చాపకింద నీరులా ఉన్న వీరిద్దరి వైషమ్యాలు తాజా ఎన్నికలతో బట్టబయలయ్యాయని తెలుస్తోంది. దీంతో వరంగల్ ఎలక్షన్ పాలిటిక్స్ రక్తి కట్టిస్తున్నాయి.

ఆరూరి వర్సెస్ కడియం…

ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పటి నుండి కడియం శ్రీహరికి శిష్యుడిగా ఎదిగాడు అరూరి రమేష్. వీరిద్దరని వరంగల్ రాజకీయ క్షేత్రంలో గురు శిష్యులనే అంటుంటారు. అంతటి సాన్నిహిత్యం ఉన్న వీరిప్పుడు ప్రత్యక్షంగా మైదానంలోకి దిగారు. కానీ గతంలోనే వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ప్రధానంగా కడియం కావ్యను వర్దన్నపేట నుండి ఎమ్మెల్యేగా చేయాలన్న లక్ష్యంగా కడియం శ్రీహరి పావులు కదిపారన్న ప్రచారం ఉంది. కావ్య స్థానిక ఆసుపత్రిలో పనిచేసినప్పుడు ఇక్కడి ప్రజలతో మమేకం కావడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే కడియం కావ్య ఎంట్రీ ఇస్తే తనకు టికెట్ దక్కదన్న ఆందోళనతో ఆరూరి కూడా పావులు కదిపారని పార్టీలో చర్చ సాగుతుండేది. కావ్య తెరంగ్రేట్రానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారన్న విషయాన్ని పసిగట్టిన అరూరి రమేష్ కూడా తన గురువు వ్యూహాలకు ధీటుగా అడుగులు వేస్తూ అధిష్టానాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవడంలో సఫలం అయ్యారు. వర్దన్నపేట ప్రజలతో మమేకం అయిన తీరును గమనించిన వారంతా కూడా అరూరికి టికెట్ దక్కడం కష్టమేనని భావించారు. అయితే ఆయన మాత్రం అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కావ్యను రాజకీయాల్లోకి రప్పించాలన్న ప్రయత్నాలకు బ్రేకులు వేయడంలో సఫలం అయ్యారన్న చర్చ కూడా అప్పట్లో సాగింది.

ప్రత్యక్ష్య పోరు ఇప్పుడే…

తాజాగా వరంగల్ లోకసభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యక్ష్య పోరు గురు శిష్యుల మధ్యే ఆరంభం అయింది. వీరిద్దరూ డైరెక్ట్ మైదానంలోకి దిగి పోరాటం చేస్తున్నది మాత్రం ఇదే తొలిసారి. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యే అయినప్పటికీ పొలిటిలక్ వార్ మాత్రం గురు శిష్యుల మధ్యే సాగుతుందన్నది వాస్తవం. ఇప్పటికే ఇద్దరి మధ్య మాటల యుద్దం కూడా స్టార్ట్ అయింది. మొదట ఇక్కడి నుండి అరూరి రమేష్ బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కడియం కావ్య పేరును ఖరారు చేశారు. అయితే ఆయన బీజేపీలోకి చేరే ప్రయత్నంలో నిలువరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ ను తాత్కాలికంగా అపగలిగారు కానీ టికెట్ కన్ఫం అయిన తరువాత రమేష్ కమలం పంచన చేరి బీజేపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేసిన కడియం తన కూతురు కావ్యకు టికెట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున బరిలో నిలిచారు. వరంగల్ టికెట్ వ్యవహారతో మరోసారి గురు శిష్యుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ వెలుగులోకి వచ్చింది. కావ్యకు టికెట్ ఖయం అవుతుందన్న సమాచారం తెలిసే రమేష్ తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీవైపు అడుగులు వేశారని తెలుస్తోంది. కానీ పార్టీ నాయకులు ఆయన్ని అడ్డుకున్నా రోజుల వ్యవధిలోనే అరూరి కాషాయం కండువా కప్పుకోకతప్పలేదు.

డైరక్ట్ అటాక్…

వరంగల్ లోకసభ ఎన్నికల్లో పోరుతో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న వార్ ఒక్కసారిగా బయపటినట్టయింది. గురు శిష్యుల మధ్య మాటల యుద్దం కూడా చోటు చేసుకుంది. ఒకరి తప్పిదాలు మరోకరు ఎత్తిచూపుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అరూరి రమేష్ కావ్య భర్త హిందువు కాదన్న సంకేతాలు బాహాటంగా ఇచ్చేశారు. ఆయన పేరును సంబోధించడంతో పాటు కావ్య గుంటూరు మెట్టినింట బిడ్డ అని కూడా కామెంట్ చేశారు. అంతేకాకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తారని తన ఓటమికి ఆయనే కారణమని కూడా కడియంపై ఆరోపణలు చేశారు. అరూరి రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వరంగల్ లో సరికొత్త చర్చకు దారి తీసిన నేపథ్యంలో కడియం కూడా ఘాటుగానే స్పందించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త అని, తానే అరూరిని క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేశానన్నారు. రమేష్ నే టార్గెట్ చేస్తూ కడియం శ్రీహరి కౌంటర్ అటాక్ చేయడం, కడియం లక్ష్యంగా అరూరి రమేష్ విమర్శలు చేస్తుండడంతో గురు శిష్యుల మధ్య వార్ డైరక్ట్ అన్నట్టుగా సాగుతోంది. ఇంతకాలం కడుపులో కత్తులు పెట్టుకున్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్న తీరు వరంగల్ ఎన్నికల ముఖ చిత్రాన సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

You cannot copy content of this page