పాప పరిహారామా… అనారోగ్య మార్గమా..?

పూజా స్టోర్స్ కేంద్రాలుగా భారీ దందా…

దిశ దశ, హైదరాబాద్:

ఆధ్యాత్మిక కార్యక్రమం అనగానే నేడు అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పూజా స్టోర్స్ దుకాణాలే. అక్కడకు వెల్తే అన్ని ఒకే చోట దొరకుతాయన్న నమ్మకం పెరిగిపోవడంతో పూజా స్టోర్స్ దుకాణాల ఏర్పాటు తీవ్రంగా పెరిగిపోయింది. ధూపం నుండి దీపం వరకు… జపం నుండి హోమం వరకు అవసరమైన అన్ని రకాల వస్తువులు, పూజా సామాగ్రి, నవ ధాన్యాలు, గోమాత విగ్రహాలు ఇలా అన్ని కూడా అక్కడ లభ్యం అవుతున్నాయి. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న ఈ పూజా స్టోర్స్ కేంద్రంగా అసలేం జరుగుతోంది..? చూడడానికి చిన్నగా కనిపించే షాపుల్లో ఏ స్థాయిలో టర్నోవర్ జరుగుతోంది అన్న విషయాలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించడం లేదు. ఇక్కడ విక్రయించే వాటికి సంబంధించిన క్వాలిటీ విషయంపై కూడా పట్టించుకునే వారు లేకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల టర్నోవర్ అవుతున్న పూజా స్టోర్స్ కేంద్రంగా సాగుతున్న భారీ దందాపై కట్టడి చేయకపోతే ఆందోళనకర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.

కాలుతున్న దీపాలు…

పూజా స్టోర్స్ లలో విక్రయిస్తున్న దీపం నూనె ఆందోళన కల్గిస్తోంది. కల్తీ ఆయిల్ విక్రయిస్తుండడంతో దీపాలు కూడా కూడా కాలిపోతున్న సందర్భాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ఆయిల్ లో కెమికల్స్ కలిపి అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే హోమాలకు వాడే నెయ్యి, ధూపం కోసం వినియోగించే ధూపం స్టిక్స్, అగరబత్తులు అన్నింటా కూడా క్వాలిటీ లేకుండా పోతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కొన్ని స్టోర్లలో విక్రయిస్తున్న ఆయిల్ తయరు చేసిన తేదీలు లేకుండా, గడుతు తేదిలు లేకుండానే విక్రయిస్తున్నారు. దీంతో ఆయా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చేస్తున్న పూజల సమయంలో ఈ ఆయిల్, ధూపం స్టిక్స్ వినియోగిస్తున్నప్పుడు వాటిని పీల్చుతున్న వారు లంగ్స్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో పౌరిహిత్యం వృత్తిలో జీవనం సాగిస్తున్న వారు అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరుతోంది. అయితే వీరు ఆసుపత్రులకు వెల్లి చెక్ చేయించుకున్నప్పుడు పొగ పీల్చుతున్నారని దీప, ధూపాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహిస్తున్నారు. తమ ప్రాణాల మీదకు తెస్తున్న కల్తీ పూజా సామాగ్రికి దూరంగా ఉండాలంటే వృత్తినే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని పురోహితులు అంటున్నారు. కల్తీ నూనేతో దీపం వెలింగించిన కొద్దిసేపట్లోనే మంటలు చెలరేగిపోతున్నాయని దీనివల్ల పూజలు చేయించుకుంటున్న వారు కూడా దీనిని అశుభ సూచకమని ఆందోళన చెందుతున్నారు. సెంటిమెంట్ విషయం ఎలా ఉన్నా కల్తీ పూజా సామాగ్రి వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చే వారు కూడా అనారోగ్యానికి గరవుతున్నారు. హోమాల్లో వాడుతున్న నెయ్యి, కట్టెలు, ఇతరాత్ర సామాగ్రి కూడా కల్తీ చేస్తున్నారని దీనివల్ల వాతావరణం కలుషితం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సాధారణంగా హోమాలు జరిపినప్పుడు అటవీ ప్రాంతంలో లభ్యం అయ్యే కట్టెలను, వివిధ రకాలా ధాన్యాలను సహజసిద్దమైనవి వినియోగిస్తుంటారు. యాగశాలలో వీటిని ఉపయోగించిన తరువాత ప్రకృతికి అంతగా నష్టం వాటిల్లకపోయేది. కానీ ఇప్పుడు కల్తీ నెయ్యి ఇతరాత్ర వస్తువులు వినియోగించడం ఇబ్బందిగా మారుతోంది.

వాటినీ…

ఇకపోతే వెండి, రాగి వస్తువులు గోమాత విగ్రహాలు దానాలు చేసే ఆచారం సాంప్రాదాయంగా వస్తోంది. అయితే వీటిని కూడా ఇనుముతో తయారు చేసి సిల్వర్, కాపర్ కోటింగ్ వేసి అమ్ముతున్నారంటే వాటిని తయారు చేస్తున్న సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పురోహితులకు వెండితో తయారు చేసిన గోమాతలను దానం చేస్తు మంచిదని నమ్మి పూజా స్టోర్సులలో కొనుగోలు చేస్తే నింగా మునిగిపోతున్న పరిస్థితి తయారైంది. ఇకపోతే వివిధ రకాల పూజల కోసం వాడే నవ ధాన్యాలు పారే నీటిలో వేయాల్సి ఉంటుంది కానీ కొన్ని చోట్ల వాటిని కూడా రీ సైక్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుంకుమ, పసుపు తదితర వాటిల్లో కూడా కెమికల్స్ కలుపుతున్నారని వీటిని తరుచూ వాడే వారికి స్కిన్ ఎలర్జీస్ వంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విగ్రహాలపై పంచామృతాల కోసం వినియోగించే నెయ్యి. తేనే, పాలు, పెరుగు వంటివి కూడా కల్తీ చేస్తుండడంతో వాటితో అభిషేకం చేస్తుండడంతో విగ్రహాలు కూడా దెబ్బతింటున్న సందర్భాలు లేకపోలేదు. పురాతన కాలం నాటి విగ్రహాలు కూడా అస్థిత్వం కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో విగ్రహాలు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్న పరిస్థితి. పూజా సామాగ్రి కల్తీ విషయంలో క్వాలిటీ కంట్రోలో పరీక్షలు చేయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

అనారోగ్యానికి గురవుతున్నాం: వామనభట్ల ప్రకాష్ శర్మ

కల్తీతో పురోహితు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. తరుచూ అనారోగ్యానికి గరవుతుండడంతో తాము ఆసుప్రతికి వెల్లి తనిఖీలు చేయించుకుంటే పొగకు దూరంగా ఉండాలంటున్నారని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ కు చెదిన వామనభట్ల ప్రకాష్ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తాము ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అనారోగ్యానికి గురి కాలేదని, ఇప్పుడు మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. కల్తీ నిరోధక విభాగం అధికారులు పూజా స్టోర్లలో విక్రయిస్తున్న ఆయా రకాల వస్తువులను, పూజా సామగ్రిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే అన్ని విధాలుగా నష్టాలు ఎదుర్కొవల్సి వస్తుంది.

You cannot copy content of this page