జూనియర్ ఎన్టీఆర్ భార్య ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కు హాజరు కాకపోవడానికి కారణం ఇదేనా?

ప్రస్తుతం భారత దేశం మొత్తం ఎక్కువగా చర్చించుకునే అంశం ఏదైనా ఉన్నదా అంది, ఆస్కార్ అవార్డు గురించి మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో తెలుగు ప్రజలు, సినీ ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామచరణ్, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు రామ్ చరణ్, ఉపాసన దంపతులపై ఫొకస్ చేస్తే మరికొందరు జూనియర్ ఎన్టీఆర్‌పై ఫొకస్ చేశారు.

అయితే ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో కీరవాణి, రాజమౌళి, రామ్ చరణ్ తమ సతీమణిలతో సందడి చేసిన విషయం తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఒక్కడు అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యాడు. కాగా, అసలు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌కు ఎందుకు దూరం ఉంది? ఎంతో గొప్ప సమయం అది అలాంటి క్షణాల్లో ప్రణతిని తారక్ ఎందుకు తీసుకరాలేదు అంటూ సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే, మరికొందరు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.

అయితే నిజానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్ర‌ణ‌తితో క‌లిసే ఆస్కార్ వేడుకకు హాజరు కావాలి అనుకున్నాడంట. కానీ, అనూహ్యంగా తార‌క‌ర‌త్న మృతి చెంద‌డంతో నంద‌మూరి కుటుంబంలో తీవ్ర విష‌యం నెల‌కొంది. దీనికి తోడు ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఆస్కార్ వేడుక‌కు కొద్ది రోజుల ముందే అనారోగ్యానికి గురైంద‌ట‌. ఇక ఈ రెండు కార‌ణాల వ‌ల్లే చివ‌రి నిమిషంలో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి త‌న ఆమెరికా టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. కానీ దీనిపై పలువు రు పలువిధాలుగా స్పందిస్తూ.. సోషల్ మీడియా వేధికగా అనేక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

You cannot copy content of this page