బార్డర్ లో జాయింట్ ఆఫరేషన్
దిశ దశ, జాతీయం:
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) ఆల్ ఇండియా చీఫ్ అతని అనుచరుడిని పట్టుకున్నారు. ఇస్లామిక్ టెర్రర్ ఆర్గనైజేషన్ లో ఒకటైన ఐసీస్ పై నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో అస్సాం ఎస్టీఎఫ్, ఎన్ఐఏ కట్టుదిట్టంగా వ్యవహరించడంతో కీలకమైన ఉగ్రవాదులను అరెస్ట్ చేయగలిగారు.
బంగ్లాదేశ్ నుండి…
ఐసీసీ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీతో పాటు మరికొంతమంది భారత్ లోకి చొరబడే అవకాశాలు ఉన్నయన్న సమచారం అందుకున్న ఎన్ఐఏ హై అలెర్ట్ అయింది. రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీరు భారత్ లోకి వస్తున్నారన్న సమాచారం మేరకు అస్సాం ఎస్టీఎఫ్ బలగాల, ఎన్ఐఏ జాయింట్ ఆఫరేషన్ నిర్వహించాయి. అస్సాంలోని దుబ్రి సెక్టార్ లోకి అడుగుపెట్టిన వీరిని అరెస్ట్ చేశారు. అస్సాం ఎస్టీఎఫ్ ఐజీ పార్థసారథి మహంత, అడిషపల్ ఎస్పీ కళ్యాణ్ కుమార్ మహంతలతో పాటు మరికొంతమంది ఎస్టీఎఫ్ అధికారులు దుబ్రి సెక్టార్ ఏరియాలో మోహరించారు. హరీస్ ఫారూఖిని పట్టుకునేందు ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ టీమ్, ఎన్ఐఏ బృందం ఈ నెల 19 సాయంత్రం కార్యరంగంలోకి దిగి సుమారు 12 గంటలకు పైగా డేగ కళ్లతో సరిహద్దులపై నిఘా వేసింది. ఉగ్రవాదుల వేట కొనసాగుతున్న క్రమంలో 20వ తేది తెల్లవారు జామున 4.15 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటిన వీరిని దుబ్రిలోని ధర్మశాల ప్రాంతంలో ఐసీస్ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ అలియాస్ హరీస్ అజ్మల్ ఫారూఖీ, అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ దివానాలను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే గౌహతి ఎస్టీఎఫ్ కార్యాలయానికి తరలించి అనుమానితులను విచారించి ఐసీస్ ముఖ్యనేతలుగా నిర్థారించారు. భారత్ లో ఐసీసీ నిర్మాణంలో భాగంగా రిక్రూట్ మెంట్ చేయడంతో పాటు, ఫండింగ్, టెర్రరిస్టు కార్యకలాపాలను పెంచిపోషించారని అస్సాం పోలీసు వర్గాలు చెప్తున్నాయి. భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు క్రియాశీలకంగా పనిచేసిన వీరిపై నిగా కట్టుదిట్టం చేయడంతో దేశం వదిలిపారిపోగా తిరిగి అస్సాంలోని దుబ్రి సెక్టార్ ఏరియా మీదుగా దేశంలోకి అడుగు పెడుతున్నారని ఎన్ఐఏ కీలక సమాచారం అందుకుంది. ఈ మేరకు సరిహద్దుల్లో కాపు కాసీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వీరిని అస్సాం ఎస్టీఎఫ్ బలగాలు ఎన్ఐఏకు అప్పగించనున్నాయి. హరీస్ ముఖ్య అనుచరుడు అనురాగ్ సింగ్ @ రెహన్ పానిపట్ కు చెందినవాడు కాగా ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించి బంగ్లాదేశీయురాలిని వివాహం చేసుకున్నారు. ఎన్ఐఏ పూర్తి స్థాయి విచారణత భారత్ లో వేళ్లూనుకున్న ఐసీసీ మూలాలను గుర్తించే అవకాశాలు ఉన్నాయి. వీరిపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయి ఉన్నాయి. ఆయా కేసుల్లో వీరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ తరువాత కస్టడీకి తీసుకుని ఉగ్ర మూలాలతో పాటు ఉగ్ర సంబంధాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. దీంతో దేశంలో చాపకింద నీరులా ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న వారి గుట్టు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.