బాబ్రీ ప్రతికారం తీర్చుకుంటాం… ఐఎస్ఐఎస్ పత్రిక…

దిశ దశ, అంతర్జాతీయం:

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన అదికారిక పత్రికలో రాసుకున్న కథనం సంచలనంగా మారింది. భారతదేశంపై మరోసారి తన ఆక్రోషాన్ని వెల్లగక్కింది. అధికారిక పత్రిక అయిన ‘‘వాయిస్ ఆఫ్ ఖురాసన్’’ 32వ సంచికలో పేర్కొన్న అంశాలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. భారతదేశానికి హెచ్చరికలు చేస్తూ రాసిన ఈ కథనంలో బాబ్రీ ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తాం… భారత ప్రభుత్వానికి చెప్తున్నాం… అవును నిజమే మేం వస్తాం… మా చేతుల్లోని కత్తులతో హిందువులను సమిష్టిగా వధిస్తామని పేర్కొంది. గుజరాత్, కశ్మీర్, జ్ఞానవ్యాపి, ముజఫర్‌నగర్‌లో హింసించబడిన ముస్లింలు అంటూ ఆ కథనంలో రాసుకుంది. ఇప్పటికే భారత దేశంలో ఉగ్రమూలాలను పెకిలించి వేసేందుకు కఠినమైన చర్యలకు పాల్పుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఐఎస్ఐఎస్ తన పత్రికలో రాసిన కథనంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగి ఈ ఉగ్ర సంస్థ కదిలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.

మోటూభాయ్ స్పందన…

టెర్రరిస్ట్ సంస్థ మ్యాగజైన్ లో రాసుకున్న ఈ కథణం గురించి స్పందించిన కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘ఇండియన్ ఆర్మీ వెయిటింగ్ ఫర్ దెమ్’ అంటై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అయితే ఓ నెటిజన్ స్పందిస్తూ ప్రతి విషయంపై ఇండియన్ ఆర్మీపై ఆధారపడడం సరికాదు… భారతీయులంతా ఉగ్రవాదుల చర్యలను కట్టడి చేసేందుకు ముందుకు రావల్సిన అవసరం ఉందన్నారు.


You cannot copy content of this page