ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ అరెస్ట్

ఢిల్లీ విమానాశ్రయంలో పట్టివేత

ఎన్ఐఏ భారీ సక్సెస్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్ (ISIS) టెర్రరరిస్టు అరాఫత్ అలీని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) బృందం గురువారం అరెస్ట్ చేసింది. కెన్యాలోని నైరోబి నుండి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన అరాఫత్ LI అదుపులోకి తీసుకుంది. 2020 నుండి పరారీలో ఉన్న అరాఫత్ కోసం ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి. వీరికి చిక్కకుండా కెన్యా వెళ్లిపోయిన అరాఫత్ గురువారం ఇండియాలో అడుగుపెడుతున్న సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని గుర్తించినప్పటికీ విదేశాల్లో ఉండడంతో అతన్ని పట్టుకోవడం సాధ్యపడలేదు. ఉగ్రవాద కార్యకలాపాలకు స్కెచ్ వేస్తూ విధ్వంసాలకు పాల్పడే పనిలో నిమగ్నం అయినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గుకు చెందిన అరాఫత్ అలీ భారతదేశంలని ముస్లిం యువకులను ఉగ్ర కార్యకలాపాల వైపు మళ్లించడం కోసం ప్రత్యేక దృష్టి సారించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. మంగుళూరులోని మంజునాథ ఆలయం వద్ద ప్రెషర్ కుక్కర్ మందుపాతర పేల్చేందుకు వ్యూహం రచించుకుని ముందుగుండు సామాగ్రిని ఆటోలో తరలిస్తున్న క్రమంలో పేలడు సంభవించింది. ఈ ఘటన కోసం ప్రణాళిక తయారు చేసిన కుట్రతో పాటు పేలుడులో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న వారితో నేరుగా సంబంధాలు కొనసాగించినట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది. టెర్రర్ కార్యకలాపాల్లో అత్యంత కీలకంగా పాల్గొన్న వారిలో ఒకడైన అరాఫత్ అలీని ఎన్ఐఏ అరెస్ట్ చేయడంతో భారతదేశంలోని ఉగ్ర మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అరాఫత్ అలీ నుండి పూర్తి సమాచారం రాబట్టినట్టయితే ఉగ్రవాదుల సంబంధాలు, షెల్టర్లు కూడా బయపడనున్నాయి.

You cannot copy content of this page