పాకిస్థాన్‌లో జరిగిన ఘటన అందరిని కలిచివేసింది. మసీదులో జరిగిన భారీ పేలుడు వలన ప్రాణ నష్టం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం పెషావర్‌లోని పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న మసీదులో ఈ పేలుడు ఘటన జరిగింది. ప్రార్థనలలు జరుగుతున్న సమయంలో దుండగుడు తనకు తానుగా పేల్చేసుకున్నాడని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుడు కారణంగా భారీ ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఈ ఘటనలో 17 మంది ప్రాణాలను కోల్పోయారు. 90 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలిపారు . మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చాలా మంది మసీదు గోడల కింద కూరుకుపోయి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. పేలుడు తరువాత ఆ ప్రదేశంలో ఎమర్జెన్సీ కింద అన్ని బ్లాక్ చేసారు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతాన్ని పాకిస్థాన్ సైన్యం కాపలాగా ఉన్నారు. ఆర్మీ కార్యాలయం కూడా పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గరల్లోనే ఉందని తెలుస్తుంది.
పేలుడులో మసీదు పైకప్పు మొత్తం కూలిపోయిందని, దుండగుడు కావాలని చేసి ఉంటాడని.. పెషావర్‌లోని మసీదులో పేలిన బాంబు శబ్ధం దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు వినిపించిందట. పేలుడు తర్వాత ఆ ప్రదేశమంతా దుమ్ము, దట్టమైన పొగలు కమ్ముకున్నాయని అక్కడ నివసించే ఉన్న ప్రజలు తెలిపారు. 2022 డిసెంబర్‌లో కూడా పాకిస్థాన్‌లో దాడి జరిగింది. ఇప్పుడు మళ్లీ ఇలా జరిగే సరికి అక్కడ ఉండే ప్రజలు ఎలా నివసించాలని భయపడుతున్నారు.