పీసీసీ వికలాంగు విభాగం ఛైర్మెన్
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, వారికి బాసటగా నిలిచిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదేనని పీసీసీ వికలాంగు విభాగం ఛైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శుక్రవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… వికలాంగులుకు, చేనేతలకు ఫించన్లు అందరికన్నా ముందు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. వికలాంగులకు, వితంతువులకు, వృద్దులకు, కల్లు గీత కార్మికులకు, అభయహస్తం ఫించన్లు ఇవ్వడం మొదలు పెట్టిందన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా వయో వృద్దుల సహకార శాఖను ఏర్పాటు చేయడం, ఉపాధి హమీ ద్వారా ఏటా 150 రోజుల పాటు పని కల్పించడం, అంత్యోదయ కార్డులు కూడా ఇచ్చిందన్నారు. వికలాంగుల చట్టలాను తయారు చేసిన ఘనత కూడా తమ పార్టీదేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కోరారు. చేనేత విభాగం రాష్ట్ర చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేనేతలకు సబ్సిడీపై నూలు, లక్ష రూపాయల రుణ మాఫీ, షెడ్డుకి రూ. 50వేలు, స్కూల్ యునిపామ్స్ వంటి వాటికి నిధులు అందించిదన్నారు. మొదట చేనేతలుకు పింఛన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెసేనన్నారు. నేడు చేనేతల సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం నూలుపై, రంగులపై, బట్టల పై 5%GST విధించడం వల్ల చేనేత కార్మికులు రోడ్డున పడ్డారని గూడురి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. 1000మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీసం ఆ కుటుంబాలను ఆదుకొక పోవడంతో పాటు పరామర్శించిన పాపన కూడా పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. వికలాంగులు, చేనేత కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డీసీసీ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్ మేనేని రోహిత్ రావు, మడుపు మోహన్, చిగురు శకుంతల, కుర్ర పోచయ్య బొబ్బిలి విక్టర్, రామిడి రాజిరెడ్డి, సలీముద్దీన్ కుంభాల రాజ్ కుమార్, సిరిపురం నాగరాజు, పరదాల లింగమూర్తి, మాలోతు మహాలక్ష్మి, రంగ లావుడ్య తదితరులు పాల్గొన్నారు.