హైదరాబాద్‌లో ఘోరం.. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఏం చేసిందంటే..?

హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే భార్యను చంపేసింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. భర్త తాగే మందులో విషం కలిపి ఇద్దరూ కలిసి హత్య చేశారు. ప్రియుడితో అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సొంత భర్తను భార్య హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మౌలాన్‌కు శాంతితో పెళ్లి అవ్వగా.. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఔషాపూర్ గ్రామంలో నివసిన్నారు. కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే మౌలన్ దుయాక్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి కుటుంబంతో గడుపుతాడు. దీంతో భర్త లేని సమయంలో భార్య స్థానికంగా ఉండే బాబు అనే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంది.

భర్త లేకపోవడంతో బాబుతో కలిసి శాంతి ఇంట్లో గడుపుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఇంటికొచ్చిన భర్తకు శాంతి అక్రమసంబంధం గురించి తెలిసింది. దీంతో గత కొంతకాలంగా భార్యతో దీని గురించి గొడవపడుతున్నారు. భార్యను రోజూ నీలదిస్తున్నారు. దీంతో కోపానికి గురైన భార్య.. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇద్దరూ కలిసి ఎవరికీ అనుమానం లేకుండా హత్య చేయాలని స్కెచ్ చేశారు.

అందులో భాగంగా ఈ నెల 6న మౌలాన్ తాగే మందులో విషం కలిపారు. విషంతో అస్వస్థతకు గురైన ఆయనను నాచారం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. అయితే తన భర్త కడుపునొప్పితో చనిపోయాడని పోలీస్ స్టేషన్ లో శాంతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాడీలో విషం గమనించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు.

పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన పోలీసులు.. దీన్ని హత్యగా గుర్తించి భార్య శాంతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా.. అసలు విషయం బయటపెట్టింది. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడి బాబుతో కలిసి హత్య చేసినట్లు తెలిపింది. దీంతో బాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

You cannot copy content of this page