దిశ దశ, జగిత్యాల:
జగిత్యాలలో ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో పార్టీ నాయకుడు ఒకరు హఠాత్తుగా కుప్పకూలిపోయారు. జగిత్యాల కౌన్సిలర్ బండారి రజని భర్త నరేందర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా పడిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్టు దృవీకరించారు. నరేందర్ రైతుం సంఘం నాయకులుగా కూడా ఎదిగారు.
నడుచుకుంటూ వెల్లి…
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కిందపడిపోయిన నరేందర్ కు సహచర పార్టీ నాయకులు సీఆర్పీ చేసిన తరువాత ఆయన ఇతర నాయకుల సహకారంతో ఆసుపత్రికి నడుచుకుంటు వెల్లి మృత్యువాత పడడం అందరినీ విషాదంలోకి నెట్టింది. కిందపడిపోయిన తరువాత లేచి నడుచుకుంటూ వెల్లిన వ్యక్తిని చూసి క్షేమంగానే ఉన్నాడని కళ్లార చూసిన వారు అనుకుంటే అంతలోనే అతని మరణ వార్త తెలిసి పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సమ్మేళనం రద్దు…
కౌన్సిలర్ భర్త నరేందర్ హఠన్మారణంతో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలన్ని రద్దు చేసుకున్నారు. శనివారం జగిత్యాలలో జరగాల్సిన పార్టీ ఆత్మీయ సమ్మేళనం కూడా రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దీంతో ఆత్మియ సమ్మేళనం నిర్వాహించాల్సిన పద్మనాయిక కళ్యాణ మండపం సంస్మరణ వేదికగా మార్చాల్సి వచ్చింది. కవిత అక్కడకు చేరుకుని నరేందర్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు.
కార్డియాక్ అరెస్ట్..?
బండారి నరేందర్ మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటూ ఆకస్మాత్తుగా పడిపోయిన నరేందర్ గుండెపై సీపీఆర్ చేయడంతో ఆయన తేరుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం నిలవలేదు. అప్పటి వరకూ తమతో పాటు ఆడిపాడిన నాయకుడు విగతజీవిగా మారడం పట్ల పార్టీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.