ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్, జీవిత ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ పెళ్లిపీటలెక్కబోతుంది. అయితే శివాని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇలా న్యూస్ రావడానికి కూడా కారణం ఉందంటున్నారు నెటిజన్స్.
అది ఏమిటంటే? ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోషూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
అయితే ఆమెరీసెంట్‌గా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో ఒక టైబుల్ పై బ్లాక్ కాఫీ కప్, బ్లాక్ గాగూల్స్ తో పాటు రెండు రింగ్స్ కూడా ఉన్నాయి. దీంతో శివానికి త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగబోతోందని.. అందుకే ఇలా రింగ్స్ తో హిట్ ఇచ్చిందని తమ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇక ఈ అమ్మడు అద్భుతం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన , ఆమె ప్రేక్షకులను అనుకుంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.అయితే గత ఏడాది ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా
లో విడుదలైన ఆహనా పెళ్లంట
వెబ్ సిరీస్ ద్వారా శివాని రాజశేఖర్‌కు మంచి గుర్తింపు దక్కించుకుంది. అయినాసరే ఆఫర్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో శివాని కెరీర్ పై ఫొకస్ మానేసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అందుకే ఈ ఫొటో షేర్ చేసిందంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది. మరి నిజంగానే శివాని రాజశేఖర్ పెళ్లి చేసుకోబోతుందో లేదో తెలియాంలంటే, ఈ వార్తలపై జీవితా రాజశేఖరో లేదా, శివాని రాజశేఖరో స్పందించాలంటూ, తమ అభిమానులు అంటున్నారు. వీరు స్పందిస్తే కానీ ఈ వార్తలపై ఎలాంటి క్టారిటీ వచ్చేలా లేదు.