సీఎం సభతోనే సరి… నామినేషన్ వేయలేదు మరి…

సమయం ముగియడంతో వాయిదా…

దిశ దశ, నిజామాబాద్:

అట్టహాసంగా నామినేషన్ వేయాలనుకుని భారీ ఏర్పాట్లు చేసుకున్నా…  సమయం కలిసిరానట్టుంది ఆ నేతకు. రాజకీయ దురంధరుడు భారీ అంచనాలతో ముందుకు సాగినా చివరి నిమిషం ముగియడంతో ఆగిపోవల్సి వచ్చింది. సభ సక్సెస్ అయినప్పటికీ ముఖ్యమైన ఘట్టం మాత్రం వాయిదా పడింది. 

కలిసిరాని సమయం…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వేసుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. సోమవారం భారీ ఎత్తున జనసమీకరణ చేసి సీఎం టూర్ సక్సెస్ చేసినప్పటికీ సమయం ముగిసిపోవడంతో ఆయన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. జన సమీకరణ కోసం బల్క్ కాల్స్ ద్వారా స్వయంగా ఆహ్వానం పలికిన జీవన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభ మాత్రం సక్సెస్ అయింది. అయితే ఇతర చోట్ల కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా చోట్ల నిర్వహించిన కార్యక్రమాలకు అటెండ్ అయి నిజామాబాద్ కు చేరుకున్నారు సీఎం. హెలిప్యాడ్ నుండి నేరుగా సభావేదిక వద్దకు చేరుకోవడం… అక్కడ ప్రసంగాల పర్వం ముగిసే వరకు నామినేషన్లు దాఖాలు చేసేందుకు సమయం ముగిసిపోవడంతో జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు బుధవారం ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

You cannot copy content of this page