50kపైగా జీతం
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తున్నాయి. ఇందుకు తగిన రీతిలో ప్రిపేర్ అయితే చాలు ఎదో ఓ ఉద్యోగం కొట్టేయచ్చు. కాకపోతే నోటిఫికేషన్లను ఫాలో అవుతూ ఉండాలి. తాజాగా భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ పరిధిలోని జార్ఖండ్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UICL) ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 239 ఖాలీలకు సంబందించిన నోటిఫికేషన్ ను సంస్థ విడుదల చేసింది. నవంబర్ 30 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అని ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు తగిన విద్యార్హతలు కూడా వెల్లడించిన సంస్థ, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ తదితర ట్రేడ్లలో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో వివరించారు. పదోతరగతిలో 50 శాతం మార్కులు సాధించి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా అందుకు సమానమైన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా యూఐసీఎల్ ఆ నోటిఫికేషన్ లో వెల్లడించింది. నవంబర్ 30 నాటికి 18-25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని, కొన్ని వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఇస్తున్నట్టు కూడా తెలిపింది. విద్యార్హతలు, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికైన ఉద్యోగులకు నెలకు రూ.56,100 వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఇస్తామని సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.