ఆర్మీలో ఉద్యోగాలు.. వీరికి మాత్రమే అవకాశం

ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎన్‌సీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్మీలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఏడాదికి రెండుసార్లు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏదాదికి సంబంధించిన తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ షార్ట్ సర్వీస్ కమిషన్ తాజాగా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాస్ అయి ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కింద మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 50, మహిళలకు 5 కేటాయించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్ లో ఉండాలి. అలాగే ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ లో బీ గ్రేడ్ ఉండాలి. అయితే యుద్దంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయస్సు జులై 1,2023 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. ఫిబ్రవరి 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. యుద్దంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేకంగా 6 పోస్టులు కేటాయించారు. ఇందులో పురుష అభ్యర్థులకు 5, మహిళలకు ఒక పోస్టు కేటాయించారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సెలక్ట్ అయినవారికి 49 వారాల ట్రైనింగ్ చెన్నైలో ఉంటుంది. ట్రైనింగ్ లో రూ.56,100 స్ట్రైఫండ్ ఇస్తారు. ఎంపిక విధానం విషయానికొస్తే.. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నాలుగు స్టేజ్ లుగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. వీటిల్లో ఎంపికైనవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ టెస్టింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

You cannot copy content of this page