దిశ దశ, హైదరాబాద్:
డ్రగ్స్ మత్తులో జోగుతున్న తెలంగాణ రాష్ట్రంలో వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మహా నగరాలే కాకుండా సెమీ అర్బన్ ఏరియాల్లోకి కూడా డ్రగ్స్ మహమ్మారి పాకిపోయింది. డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారు సాధారణ జీవనంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. మానవ జీవితాలతో చెలగాటమాటే డ్రగ్స్ వల్ల కుటుంబాలు కూడా వీధినపడ్డ సంఘటనలు కూడా లేకపోలేదు. ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందిన వారే డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. అయితే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను కటట్డి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న రవి గుప్త కొద్ది సేపటి క్రితం ‘ఎక్స్’ వేదికగా సందేశం ఇచ్చారు. తెలంగాణాను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఏకం కావల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారులు, వినియోగించే వారికి కూడా డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ కట్టడి చేసేందుకు ప్రతి ఒకకరూ తమతో చేతులు కలపాల్సిన అవసరం ఉందని రవి గుప్త అభిప్రాయపడ్డారు.
https://x.com/TelanganaDGP/status/1737309553669394601?s=20