బీఆర్ఎస్ లో చేరుతున్నా… బహుజన వాదం వదలను…

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్…

ధిశ దశ, హైదరాబాద్:

బహుజన వాదాన్ని గుండెల్లో పదిలంగా పర్చుకుంటా… వారి కలలను నిజం చేసే దిశగా పయనిస్తా… బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానంటూ బీఎస్పీ స్టేట్ మాజీ చీఫ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాజకీయ భవిష్యత్తు గురించి హైదరాబాద్ లో వందలాది మంది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేథో మథనం జరిపా… రకరకాల అభిప్రాయాలు వచ్చాయి… కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంట నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిచారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దేశంలో లౌకికతతవ్వాన్ని కాపాడడం కోసం రాజ్యాంగ రక్షణ కోసం బహుజనుల అభ్యున్నతి కోసం నేను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

You cannot copy content of this page