గంగుల ఇలాకాలో రాజీనామాల పర్వం స్టార్ట్…

దిశ దశ, కరీంనగర్:

బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇలాకాలో రాజీనామాల పర్వం మొదలైంది. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా తాను ఫలనా పార్టీలో చేరుతున్నట్టుగా కూడా స్థానిక ప్రజా ప్రతినిధి అదే లేఖలో పేర్కొనడం గమనార్హం. కొత్తపల్లి మండలంలోని చింతకుంట ఎంపీటీసీ శారద కొద్ది సేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా లేఖను అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ లకు పంపించారు. ఈ లేఖలో తాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆ రాజీనామా లేఖలో వెల్లడించారు. సాధారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా లేఖలో పేర్కొనడం సహజం కానీ చింతకుంటు 1 ఎంపీటీసీ శారద మాత్రం తాను ఏ పార్టీలో చేరుతున్నానో కూడా రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. శారద రాసిన ఈ  రాజీనామా లేఖ నెట్టింట వైరల్ అవుతుండడంతో కరీంనగర్  బీఆర్ఎస్ పార్టీ నుండి వలసల పర్వం స్టార్ట్ అయిందన్న చర్చ జరుగుతోంది.

You cannot copy content of this page