బాబాయ్ కి అబ్బాయ్ ఫోన్

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలను తెలుసుకున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎన్టీఆర్‌కు బాలయ్య చెప్పారు. తారకరత్న కోలుకుంసినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. టున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తున్నామని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోలుకుంటున్నారని తెలిపారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయిందని, మిగతా అన్ని రిపోర్టులు బాగానే ఉన్నాయని బాలయ్య చెప్పారు. చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య విషయం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. గ్రీన్ ఛానెల్ ద్వారా అంబులెన్స్‌లో బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవాళ కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం బయటకు వచ్చి లోకేష్, బాలయ్యతో కలిసి నడిచారు. వారితో పాటు పాదయాత్రలో నడుస్తుండగా.. ఒక్కసారిగా తారకరత్న గుండెపోటుతో కుప్పకలిపోయారు. దీంతో వెంటనే ఆయనను దగ్గరలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించనున్నట్లు బాలయ్య తెలిపారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి బాలయ్య, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుసుకుంటున్నారు. చంద్రబాబుకు ప్రతి అప్డేట్‌ను తెలియజేస్తున్నారు. తొలుత తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రాణాప్రాయం లేదని బాలకృష్ణ చెప్పడంలో టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. మరో వైపున తొలిరోజు పాదయాత్ర ముగిసిన తరువాత నారా లోకేష్ కూడా ఆసుపత్రికి చేరుకుని తారక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే బెంగుళూరు నుండి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం వైద్య సేవలందిస్తోందని బాలయ్య లోకోష్ కు వివరించారు.

You cannot copy content of this page