కాళేశ్వరం పంపు హౌజ్ ల ఏర్పాటుపై ఆ నాడే చెప్పిన ‘‘దిశ దశ’’

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన పంపు హౌజ్ ల తీరుపై గతంలో ‘‘దిశ దశ’’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పంప్ హౌజ్ ల నిర్మాణం విషయంలో వరద నీరు ఎంత ఎత్తులో ప్రవహించే అవకాశం ఉంటుంది అన్న విషయంపై అంచనా వేయడంలో విఫలం అయ్యారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డకు ఎగువన నిర్మించిన కన్నెపల్లి, అన్నారం ఎగువన నిర్మించిన సిరిపురం పంపు హౌజ్ లకు సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా ఇదే అంశాన్ని జస్టిస్ ఘోష్ అధికారులను ప్రశ్నించడం గమనార్హం. కాళేశ్వరం వైఫల్యాలపై విచారణ జరుపుతున్న జ్యుడిషియల్ కమిటీ ఈ మేరకు అధికారులను విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా బ్యారేజీలతో పాటు పంపు హౌజులకు సంబంధించిన అంశాల గురించి కూడా అధికారులను ప్రశ్నించడం మొదలు పెట్టింది.  వీటిని ఏర్పాటు చేసే విషయంలో సీడీఓతో కాకుండా జెన్ కో డిజైన్లు ఇవ్వడానికి కారణమేంటని కమిషన్ ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన జెన్ కో ఇరిగేషన్ విభాగం చేపట్టే పనులకు పవర్ సప్లై గురించి మాత్రమే క్లియరెన్స్ ఉంటుంది కానీ… పంపు హౌజ్ విషయంలోనూ ఫైనలైజ్ చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది. వరధ ఉధృతిని అంచనా వేయడం, వరధ ఎంత ఎత్తులో ప్రవహించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అంచనా వేయడంపై ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్దారించాల్సి ఉంటుంది. అయితే కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసే జెన్ కో ద్వారా ఎందుకు అప్రూవల్ తీసుకున్నారన్నదే మిస్టరీగా మారిపోయింది. అయితే గత సంత్సరం డిసెంబర్ 28నే కాళేశ్వరం పంప్ హౌజులకు సంబంధించిన వివరాలతో కూడిన సమగ్ర కథనాన్ని ‘‘దిశ దశ’’ ప్రచూరించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా పంపు హౌజుల నిర్మాణం తీరుపై ప్రశ్నల వర్షం కురిపించడం గమనార్హం.

కాళేశ్వరం పంప్ హౌజులకు సంబంధించిన వివరాలతో కూడిన సమగ్రమైన కథనం కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.

పంప్ హౌజ్ ల నిర్మాణంలోనూ తప్పిదాలేనా… ముంపునకు గురయ్యే విషయాన్ని విస్మరించారా..?


You cannot copy content of this page