మొండెం దొరికింది తల ఏమైంది..? జ్యోతిష్మతి స్టూడెంట్ మిస్సింగ్ మిస్టరీ…

దిశ దశ, మానకొండూరు:

తల లేని మొండెం ఒకటి వ్యవసాయ బావిలో లభ్యం అయింది. ఇంతకీ తల ఏమైందన్నదే మిస్టరీగా మారింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ విద్యార్థి అదృశ్యం అయినప్పటి నుండి శవంగా మారిన వరకూ అసలేం జరిగింది అన్నదే అంతుచిక్కకుండా పోతోంది. నాలుగు రోజుల క్రితం వరకూ ఆ విద్యార్థి మిస్సింగ్ మిస్టరీగా మిలిపోతే… బుధవారం శవమై తేలిన ఆ స్టూడెంట్ తల ఏమైపోయిందో తెలియడం లేదు. దీంతో అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు తల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఆ బైక్ ఎవరిది..?

మార్చి ఒకటి నుండి తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న అభిలాష్ అదృశ్యం అయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన అభిలాష్ ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మరునాడు అతని కుటుంబ సభ్యులు హస్టల్ వార్డెన్ కు కాల్ చేసి తమ బాబు కనిపించడం లేదంటూ ఆరా తీశారు. అభిలాష్ హాస్టల్ లో కూడా కనిపించడం లేదన్న సమాధానం విన్న పేరెంట్స్ ఆందోళన చెంది మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి అభిలాష్ గురించి ఆరా తీస్తున్న పోలీసులకు అతని ఆచూకి మాత్రం దొరకలేదు. అభిలాష్ కనిపంచకుండా పోయిన ముందు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలో వెలుగులోకి వచ్చిన అంశాలన్ని కూడా నివృత్తి చేసుకున్నారు. అయితే ఆ రోజు రాత్రి కాలేజీ వెనక ప్రాంతంలో ఉన్న అభిలాష్ మెయిర్ రోడ్డు పైకి చేరుకుంటూ వెల్తూ ఓ బైక్ ఎక్కినట్టుగా అనుమానిస్తున్నారు. బైక్ వద్దకు అభిలాష్ చేరుకుంటున్న క్రమంలో అటుగా ఓ లారీ వెళ్లడంతో దాని ఆనవాళ్లు దొరకకుండా పోయాయి. దీంతో అభిలాష్ వెల్లిన బైక్ ఎవరిది… దానిని ఎవరు తీసుకొచ్చారు..? బైక్ పై అభిలాష్ ఎటు వెళ్లాడు అన్న వివరాలు తెలియకపోవడంతో అతని స్నేహితులతో పాటు కాల్ డిటేయిల్స్ రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా విచారణ జరిపారు. 27 రోజులుగా ఎల్ఎండీ పోలీసులు, అభిలాష్ కుటుంబ సభ్యులు అతని గురించి ఆరా తీస్తున్నప్పటికీ పలితం లేకుండా పోయింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె కోసం అన్వేషిస్తున్న క్రమంలో తిమ్మాపూర్ క్రాస్ రోడ్ వెనక ప్రాంతంలోని వ్యవసాయ బావిలో తల లేని మొండాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాన్ని బయటకు తీయగా మొబైల్ ఫోన్ కూడా అందులోనే లభ్యం కావడం దస్తులను శరీరం ఆనవాళ్లను గుర్తించిన పేరెంట్స్ అది అభిలాష్ డెడ్ బాడీయేనని తేల్చారు.

తల కోసం…

అయితే మొండెం మాత్రమే దొరకడంతో తల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభిలాష్ హత్య చేసి వ్యవసాయ బావిలో పడేశారా..? ఆయనే సూసైడ్ చేసుకున్నాడా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోతోంది. తల లేకపోవడంతో ఎవరో హత్య చేసి బావిలో పడేసి వెల్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ అతన్ని చంపేంత శతృవులు ఎవరున్నారోనన్నది తెలియడం లేదు. పోలీసులు కూడా అభిలాష్ స్నేహితులను విచారించారు. సీడీఆర్ ఆధారంగా తిరుపతిలో ఉన్న వారిని గుర్తించి వారి వద్దకు కూడా వెల్లి ఆరా తీశారు. కానీ అతని మరణానికి మాత్రం కారణాలు తెలియరావడం లేదు. అతని పేరెంట్స్ కూడా అభిలాష్ తల కోసం ఆందోళన చెందుతున్నారు. చివరకు శనివారం వ్యవసాయ బావిలోకి దిగి తల కోసం వెతికేందుకు ప్రయత్నించినప్పటికీ పలితం లేకుండా పోయింది. నీటి అడుగున తల ఉంటుందా అన్న అనుమానంతో వారు ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ బావిలో నీరు చాల ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు.

కాలేజీ ముందు నిరసన…

ఇంజనీరింగ్ విద్యార్థి అభిలాష్ మరణం వైపు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టూడెంట్ విషయంలో జ్యోతిష్మతి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. కాలేజే డే ఫంక్షన్ నిర్వహించేందుకు యాజమాన్యం మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి మరీ ఫెస్టివల్ నిర్వహిస్తుండడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టంత కొడుకును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల గురించి యాజమాన్యం పట్టించుకోని తీరుపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

You cannot copy content of this page