కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇలా చేయండి: ఆకునూరి మురళీ కీలక సూచనలు

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మరళి స్పందించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన కీలక సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. సిట్టింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయి నీటి పారుదల రంగాలు, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక నిపుణులతో కూడిన టెక్నికల్ కమిటీని వేయాలని ఆకునూరి మురళీ సూచించారు. ఈ కమిటీచే ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు..? ఎన్ని ఎకరాలకు పారాయి, ఎంత కరెంటు బిల్లు కట్టారు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణాలు ఏంటీ..? బాధ్యులు ఎవరు..? ఈ ప్రాజెక్టు వలన ఖర్చు తగ్గ ఫలితం వస్తోందా..? ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అన్న విషయాలపై నిపుణుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. ఇంకా పెట్టుబడి పెట్టాలా లేక ప్రాజెక్టు ఇక్కడితోనే మూసివేయాలా..? అన్న వివరాలను కూడా తెలుసుకోవాలన్నారు.
మౌళిక సదూపాయాల expertise ఉన్న Asian Development bank ను అభ్యర్థించి పై విషయాలను విచారించి రిపోర్ట్ తీసుకున్న తరువాతే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

You cannot copy content of this page