లిక్కర్ స్కామ్ లో సీఎం డాటర్

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. సౌత్‌ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ వివరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన అమిత్‌ అరోరాను దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చినప్పుడు కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. సౌత్‌గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్లు విజయ్‌ నాయర్‌కు చేరాయని వెల్లడించిన ఈడీ, ఈ విషయాన్ని అమిత్‌ అరోరా కూడా ధ్రువీకరించారని పేర్కొంది.

ఈఎంఐ నెంబర్లతో సహా

కల్వకుంట్ల కవిత వినియోగించిన మొబైల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేసినట్టు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఆమె మొత్తం పది మొబైల్ ఫోన్లను మార్చినట్లు అందులో పేర్కొన్న ఈడీ ఇందుకు సంబంధించిన వివరాలను కూడా రిమాండ్ రిపోర్టులో వివరించడం గమనార్హం. అయితే ఇప్పటివరకు కవిత పేరు కావాలని బదనాం చేశారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ డి రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి. రాష్ట్ర రాజకీయాలపై కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కూడా ఆయన కవిత లిక్కర్ స్కాం ఉచ్చులో చిక్కుకోవడం మాయని మచ్చేనని అంటున్నారు.

You cannot copy content of this page