రేపు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిదే. బీజేపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ కండువా కప్పుకోనున్నారు. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో కన్నా లక్ష్మీ నారాయణ చేరనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో తన స్థానం ఏమిటనే విషయంపై కన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో తన పాత్ర ఏమిటో పార్టీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధినేత నిర్దేశించినట్టుగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

కాగా, వైసీపీ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీ నారాయణ నిప్పులు చెరిగారు. జగన్‌ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని వ్యాఖ్యానించారు. ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి ఆపై రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని కన్నా విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని తరలింపు జగన్ దోపిడీ కోసమేనని వ్యాఖ్యానించారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని చెప్పారు. ఏపీని సీఎం జగన్ బీహార్ కంటే అధ్వాన్నంగా మార్చేశారని కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటీ నుండి రాష్ట్రంలో రాక్షస పాలన ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వైసీపీకి ఉంటే ప్రతిపక్షాలను చూసి సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు విధులు నిర్వహించని పక్షంలో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. మోదీ నాయకత్వం బాగున్నా ఏపీ బీజేపీ నాయకత్వం సరిగా లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page