కన్నారావు అరెస్ట్…

దిశ దశ, హైదరాబాద్:

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన కేసులో కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్ రావు మంగళవారం ఉదయం పోలీసుల ముందు లొంగిపోయారు. భూ సంబంధిత కేసులో ఇప్పటికే రెండు సార్లు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన సంబంధిత సీఐ వద్ద లొంగిపోతున్నానని వెల్లడించారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నేగూడలో భూకబ్జాకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు కన్నారావుతో పాటు మరో 38మందిపై కేసు నమోదు అయింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆచూకి లభ్యం కాలేదు. బెంగూళురులో ఉన్నాడని, సింగపూర్ కు వెళ్లాడని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అతనిపై లూక్ ఔట్ సర్క్యూలర్ నోటీస్ (ఎల్ఓసీ) ఇచ్చారు పోలీసులు. విదేశాలకు వెల్లినట్టయితే విమానాశ్రయాల్లో దిగగానే ఇమ్మిగ్రేషన్ వద్దే కన్నారావును అరెస్ట్ చేసేందుకు ఎల్ఓసీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కన్నారావు మాత్రం పోలీసుల ముందుకు లొంగిపోవడం గమనార్హం. ఆయనపై ఐపీసీ 147,148,447,427,307,436,506,r/w149 సెక్షన్లలో కేసు నమోదు అయింది.

కేసు కొట్టేస్తారు…

కల్వకుంట్ల కన్నారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే దొరకనందునే తాను సీఐ ముందు లొంగిపోయానన్నారు. భూమికి సంబంధించిన సరిహధ్దుల కారణంగా వివాదం రావడంతో ఈ కేసు నమోదు అయిందన్నారు. తనకు బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కన్నారావు పోలీసులు పెట్టిన ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేస్తుందన్నారు. కేసు కొట్టివేసిన తరువాత కూడా మీడియా ఇదే స్థాయిలో పబ్లిసిటీ చేయాలన్నారు.

You cannot copy content of this page