కరీంనగర్ ‘బార్’ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్

రీ కౌంటింగ్ చేసినా వారే గెలుపు

దిశ దశ, కరీంనగర్ లీగల్:

కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షునిగా భూపాల్ రావు రఘునందన్ రావు 24 ఓట్ల తేడాతో, ప్రధాన కార్యదర్శిగా లింగంపెల్లి నాగరాజు 12 ఓట్లతో తేడాతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఓటమి పాలైన అధ్యక్ష అభ్యర్థి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి భేతి మహేందర్ రెడ్డిలు రీ కౌంటింగ్ చేయాలని ఎన్నికల అధికారులను అభ్యర్థించారు. గెలుపొందిన అభ్యర్థులకు తమకు స్వల్ప ఓట్ల తేడా ఉండడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మళ్లీ చేపట్టాలని కోరారు. దీంతో ఎన్నికల అధికారులు మరోసారి కౌంటింగ్ చేయగా అధ్యక్షునిగా బి రఘునందన్ రావు 23 ఓట్ల తేడాతో గెలుపొందారని, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు 11 ఓట్ల తేడాతో గెలుపొందారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

25 ఏళ్ల తరువాత…?

కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రీకౌంటింగ్ జరగడం అతి తక్కువ సందర్భాల్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితం ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో సారి జరగగా తాజాగా ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులు కోరడంతో రీకౌంటింగ్ చేపట్టాల్సి వచ్చింది.

You cannot copy content of this page