పట్నం వెల్లిన ‘పొన్నం’ దండు

కీలక పదవి ఇవ్వాలని కోరనున్న కేడర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ ను కలిసే అవకాశం

దిశ దశ, కరీంనగర్:

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు పదవులు కట్టబెట్టే విషయంలో అధిష్టానం వైఖరిపై కినుక వహించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీపీసీసీ పెద్దలను మెప్పించి, ఒప్పించేందుకు కార్యరంగంలోకి దిగారు. తాజాగా ప్రకటించిన ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో కూడా పొన్నం ప్రభాకర్ కు ప్రాతినిథ్యం కల్పించకపోవడంపై కరీంనగర్ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన అలక…

ఏఐసీసీ ప్రకటించిన కమిటీలో కానీ, పీసీసీలో కానీ కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో తనను విస్మరించారని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్ యూఐ నుండి ఎంపీగా ప్రస్థానం కొనసాగించిన తనకు పార్టీ ఏ మాత్రం ప్రయారిటీ ఇవ్వడం లేదని కలత చెందారు పొన్నం. అధిష్టానం వైఖరిపై ఆవేదన వ్యక్తం చేస్తున్న పొన్నం బయటకు మాత్రం చెప్పడం లేదు. కరీంనగర్ కు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిందిపోయి ఇక్కడి నాయకున్ని కూడా పట్టించుకోకపోవడం ఎందుకో అంతుచిక్కకుండా పోతోందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరేందుకు కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుండి పార్టీ శ్రేణులు ఆదివారం హైదరాబాద్ కు బయలుదేరాయి. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి పొన్నం ప్రభాకర్ కు సముచిత స్థానం కల్పించాలని అభ్యర్థించనున్నారు.

You cannot copy content of this page