కరీంనగర్ కార్పోరేటర్ లక్ష్యంగా రెక్కి…?

రంగంలోకి దిగిన పోలీసులు…

కరీంనగర్ లో అధికార పార్టీ కార్పోరేటర్ కుటుంబమే లక్ష్యంగా రెక్కి జరిగింది. ఇందు కోసం సుపారి గ్యాంగ్ కరీంనగర్ శివార్లలోకి ఎంట్రీ ఇచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కరీంనగర్ కార్పోరేషన్ లోని కృష్ణ (లడ్డు)ను హత్య చేసేందుకు కొంతమంది మెడికల్ కాలేజీ ఏరియాలో షెల్టర్ తీసుకుని వ్యూహం పన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో లడ్డుకు సంబందించిన వారిని కూడా పిలిపించుకున్న సుపారి గ్యాంగ్ ఆయన్ని హతం చేస్తామని కూడా స్ఫష్టంగా చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుకుసుకున్న సదరు కార్పోరేటర్ భర్త హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి విషయాన్ని ఆరా తీయగా కొంతమంది లడ్డూ ఇంటి ఏరియాలో తచ్చాడినట్టు గుర్తించారు. ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజీని కూడా సేకరించిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. అయితే లడ్డుతో పాటు అతని ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని గ్యాంగ్ ఎందుకు రెక్కి నిర్వహించింది..? వారెవరూ అన్న వివరాలను తెలుసుకునే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయినట్టు సమాచారం. కార్పోరేటర్ ఇంటి చుట్టూ గ్యాంగ్ సంచరించిన ఫుటేజీ కూడా పోలీసులకు లభ్యం అయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏకంగా ఓ కార్పోరేటర్ ఫ్యామిలీయే లక్ష్యం చేసుకుని ఈ గ్యాంగ్ ఎందుకు ఎంటర్ అయింది..? వీరి వెనక ఉన్నదెవరూ అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

You cannot copy content of this page