దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు కమిషనరేట్ ప్రక్షాళాణ స్టార్ట్ చేశారు. నెమ్మదిగా ఒక్కో విభాగంలో మార్పులు చేర్పులు చేయడం ఆరంభించారు. రెండు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ వింగ్ లో సిబ్బందిని బదిలీ చేయగా, తాజాగా సీసీఆర్బీ యంత్రాంగాన్ని కూడా వివిధ స్టేషన్లకు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి సంపూర్ణ అవగాహన చేసుకున్న తరువాత సీపీ సుబ్బరాయుడు తన కలానికి పని చెప్పి బదిలీల ప్రక్రియకు తెర తీసినట్టుగా తెలుస్తోంది. రిజర్వూ విభాగంలో పని చేస్తున్న కొంతమంది ఎస్సైలను స్టేషన్లకు అటాచ్డ్ పోస్టింగ్స్ ఇచ్చి పనికి పురమాయించినట్టు తెలిసింది. బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంలో విఫలం అయిన తరువాత ఆయన తన దృష్టిని శాఖపరంగా ప్రక్షాళన చేయడంపై సారించినట్టుగా తెలుస్తోంది. ఇదే విధానంతో కమిషనరేట్ కార్యాలయానికి అనుభందంగా ఉండే అన్ని వింగ్స్ లోనూ బదిలీల ప్రక్రియ కొనసాగించనున్నట్టుగా తెలుస్తోంది.
ఏఆర్ పీసీ సస్పెన్షన్…
ఇటీవల కరీంనగర్ లో హల్ చల్ చేసిన గన్ మెన్ పై వేటు వేశారు కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు. ఈ నెల 2 నుండి విధులకు గైర్హాజరై సర్వీస్ రివాల్వర్ తో ప్రజల్లో భయ భ్రాంతులకు గురి చేసిన వ్యవహారంలో సస్పెన్షన్ చేశామని సీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏఆర్ పీసీ మహేందర్ ప్రముఖుని వద్ద గన్ మెన్ గా పనిచేస్తూ విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించాడని వేటు వేశామని తెలిపారు.