కరీంనగర్ సీపీ వర్సెస్ మానకొండూరు ఎమ్మెల్యే…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. దళిత అధికారులపై సీపీ వివక్షని ఆయన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

మంచి పనులు చేస్తున్నారు కానీ…

కరీంనగర్ సీపీ మంచి పనులే చేస్తున్నారు కానీ దళిత పోలీసు అధికారులపై వివక్ష చూపేందుకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపణలు చేశారు. నలగురు పోలీసు అధికారులను విధుల్లో చేర్చుకోకుండా తిప్పి పంపారని, సంస్థను కూడా పట్టించుకోకుండా చేశారు. తాను దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం విషయంలో అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరుపై వ్యాఖ్యానించినప్పుడు తన వ్యాఖ్యలను హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వక్రీకరించారని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తన వ్యాఖ్యల పట్ల చేసిన విమర్శలను తిప్పి కొట్టారు కవ్వంపల్లి. మీ హయంలో రికమండేషన్లు చేసి పోస్టింగులు ఇచ్చే విధానం ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మాత్రం సహాయం లేదు. లేఖలు సిఫార్సులు ఇచ్చే సంస్కృతికి తాము నటించామని, అయితే దళిత ఎమ్మెల్యేలపై చూపుతున్న వివక్షను చూపించామని. బీఆర్ఎస్ హయంలో డబ్బులు తీసుకుని పోస్ంగులు ఇచ్చి గడువు ముగియకముందే బదిలీలు చేయించిన చరిత్రతో పాటు తప్పుడు కేసులు పెట్టించిన ఘటనలూ ఉన్నాయని గుర్తించారు. తమ హయంలో ఎవరిపై కూడా తప్పుడు కేసులు పెట్టలేదని, చట్టం తన పని తాను చేసుకుని వెల్లాలన్న ఆలోచనతోనే తాము పనిచేస్తున్నామని కవ్వంపల్లి సత్యనారాయణ. రసమయి బాలకిషన్‌కు సంబంధించిన నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని వాటిని కూల్చివేసేందుకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. హైకోర్టు కూడా అసైన్డ్ భూమిలో నిర్మాణాలు ఉంటే తొలగించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

వాస్తవం ఇది…

అయితే కరీంనగర్ పోలీసు కషనరేట్ పోస్టింగుల విషయంలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసు అధికారుల విషయంలో సీపీ తీసుకున్న నిర్ణయాలు తప్పని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమిషనరేట్‌లో పోస్టింగుల తీరుపై అటు పోలీసు వర్గాల్లో, ఇటు ప్రజా క్షేత్రంలో సరికొత్త చర్చ మొదలైంది. జిల్లాలో 18 పోలీస్ స్టేషన్లు ఉండగా అందులో 11 ఎస్ఐలు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లుగా మిగిలినవి సీఐలు ఎస్ హెచ్ ఓలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. 11 పోలీస్ స్టేషన్లలో ఐధుగురు దళిత అధికారులు ఉండగా, మరో ఐదుగురు బీసీ అధికారులు, ఒక చోట అగ్రవర్ణానికి చెందిన అధికారి విధులు నిర్వర్తిస్తున్నారని, సీఐ ఎస్హెచ్ ఓలుగా ఉన్న స్టేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారుల విధుల్లో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అగ్రవర్ణాలకు కొమ్ము కాసే విధంగా సీపీఐ అభిషేక్ మహంతి జరిగిందని వాదనల విషయంలో అయినా, లూప్ లైన్ విభాగాల్లో పని చేసి వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారన్న ఆరోపణలే అయినా సరికావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీపీలు తీసుకున్న తరువాత పోస్టింగ్ పొందిన వారిలో చాలా మంది లూప్ లైన్ విభాగాల్లో పని చేసిన వారే కాకుండా, అగ్రవర్ణ సామాజిక వర్గాలకు చెందిన వారే అసలే లేరని అంటున్నారు. రికమండేషన్లు చేయించుకునే పరిస్థితి లేకుండా చాలా కాలంగా లూప్ లైన్ విభాగాల్లో విధులు నిర్వర్తించిన వారికే అవకాశం కల్పించారని పోలీసులు చర్చించుకుంటున్నారు.

80 శాతం మంచి చేస్తున్నారు…

మరో వైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి ఆడియో విడుదల చేశారు. విదేశాల్లో ఉన్న ఆయన కరీంనగర్ సీపీకి అనుకూలంగా మాట్లాడారు. గతంలో సీపీపై బహిరంగ లేఖ రాసిన కొత్త జైపాల్ రెడ్డి తాజా పరిణామాలపై పంపిన ఆడియో మరో చర్చకు దారి తీస్తోంది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి 80 శాతం వరకు మంచి పనుల కోసం, కరీంనగర్ కమిషనరేట్ లో భూ దందాలకు అర్హులైన వారు, ఛీటింగ్ చేసే వాళ్లను అరెస్ట్ చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని కొత్త జైపాల్ రెడ్డి. సీపీపై వస్తున్న ఆరోపణలు తప్పని ఆయన తాను విడుదల చేసిన ఆడియోను వైరల్ చేసి సానుకూలతను ప్రదర్శించాలని కూడా అభ్యర్థించడం గమనార్హం.

 

You cannot copy content of this page