డాక్టర్స్ డే స్పెషల్
దిశ దశ, కరీంనగర్:
పేషెంట్ల ఆరోగ్యం కోసం తపన పడుతూ హడావుడి జీవితం కొనసాగించే డాక్టర్లు యాక్టర్లుగా మారిపోయారు. ఎప్పుడూ హస్పిటల్స్ మందులు, చికిత్స అంటూ రోజులు గడిపే డాక్టర్లు తమలోని కళాత్మకతను వెలికి తీశారు. డాక్టర్స్ డే సందర్భంగా కరీంనగర్ వైద్యులు ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కరీంనగర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి డాక్టర్స్ డే జరుపుకున్న తీరు వారిలో నూతనోత్సహాన్ని నింపింది. స్పెషల్ డే అనగానే ఓ కేకు కట్ చేయడం, స్వీట్లు తినిపించిడంతో జీవితాన్ని సరిపెట్టుకుంటే ఎలా అనుకున్నారు కరీంనగర్ డాక్టర్లు. వైవిద్యంగా డాక్టర్స్ డే జరుపుకుంటే పోలా అనుకున్న వీరు నేటి నాటు నాటు పాట నుండి నాటి జుంబారే జుంజుంబారే పాట వరకు అలనాటి మేటి నటులను మరిపించి మైమరిపించేలా చేశారు. నేటితరానికి చెందిన డాక్టర్లు నాటి తరానికి చెందిన హీరోల డ్యాన్సులు ప్రదర్శించి తమలోని కళను ప్రదర్శించారు. డాక్టర్లంటే స్టెత్ పట్టుకునే ఉంటారనుకోకండి వారిని తట్టిలేపితే కళలు కూడా బయటకు వస్తాయని చేతల్లో చూపించారు కరీంనగర్ వైద్యులు. వివిధ రకాల ప్రదర్శనలతో రోటిన్ కు భిన్నంగా కరీంనగర్ డాక్టర్లు డాక్టర్స్ డే జరుపుకుని కేరితంలు కొడుతూ ఆనందంలో మునిగి తేలారు. డిఫరెంట్ గా ఆలోచించి నాటి హీరోల డ్యాన్సులను ప్రదర్శించిన తీరు సభికులను ఆకట్టుకుంది. శనివారం అర్థరాత్రి వరకూ సాగిన కరీనగర్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ రాష్ట్రంలోనే హైలెట్ గా నిలిచాయని చెప్పాలి.