పట్టభద్రుల ఎమ్మెల్సీ పలితాలు: రౌండ్ల వారిగా ఫలితాలివే…

బీజేపీ, కాంగ్రెస్ టఫ్ ఫైట్

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. 3.55 లక్షల ఓటర్లకు గాను మొత్తం 2.53 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 2.24 లక్షల ఓట్లను లెక్కించే ప్రక్రియ మంగళవారం మద్యాహ్నం ప్రారంభం అయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. మొత్తం 21 టేబుళ్ల ద్వారా 11 రౌండ్లు కౌంటింగ్ కొనసాగనుంది. మొదటి రౌండ్ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697, కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. లంచ్ బ్రేక్ తరువాత రెండో రౌండ్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

టఫ్ ఫైట్…

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు ఉత్కంఠతను రేకిత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి కంటే 24 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. 11 రౌండ్లు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించినప్పటికీ 50  శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థి సాధించే అవకాశం లేనట్టుగా స్పష్టం అవుతోంది. ఈ లెక్కన రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించడంతో పాటు ఎలిమినేషన్ రౌండ్ కూడా కొనసాగించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభం అయిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయినప్పటికీ నాలుగు జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో చెల్లని ఓట్లు తొలగించి తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే ప్రక్రియ ప్రారంభం మాత్రం మంగళవారం మద్యాహ్నం 11.30 గంటల సమయంలో స్టార్ట్  అయింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం ఖచ్చితంగా మరో 24 నుండి 36 గంటల సమయం పట్టే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

2ND ROUND

బిజేపి అంజిరెడ్డి కి వచ్చిన ఓట్లు 14690

కాంగ్రెస్ నరేందర్ రెడ్డి కి వచ్చిన ఓట్లు 13198

బిఎస్పి ప్రసన్న హరికృష్ణ వచ్చిన ఓట్లు 10746

రెండవ రౌండులో 1492 లీడ్ బిజేపి అభ్యర్థి అంజిరెడ్డి

3RD ROUND

బీజేపీ లీడ్: 4417

బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి: 23246

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి:  18926

బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ: 15740

4TH ROUND

బీజేపీ అంజిరెడ్డి 31117

కాంగ్రెస్ నరేందర్ రెడ్డి 25356

బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ 21151

బీజేపీ లీడ్ 5161

You cannot copy content of this page