ఇటలీ టు కరీంనగర్…

కరీంనగర్ శిశు గృహ నుండి బాలుడి దత్తత

దిశ దశ, కరీంనగర్:

ఓ బాలున్ని దత్తత తీసుకునేందుకు ఇటలీ నుండి ఇండియాకు వచ్చారు ఆ దంపతులు. కరీంనగర్ శిశు గృహలో ఉన్న అనాథ బాలున్ని దత్తత తీసుకునేందుకు ఇటలీకి చెందిన వారు ముందుకు వచ్చారు. 10 ఏళ్ల వయసు ఉన్న బాలుడిని స్పెషలైజ్డ్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా వారికి అప్పగించారు జిల్లా అధికారులు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అనాథ బాలుడిని బాగా చూసుకోవాలన్నారు ఇటలీకి చెందిన దంపతులతో అన్నారు. దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన దంపతుల వద్ద బాలుని పర్యవేక్షణ బాధ్యతలు తామే చూసుకుంటామని ప్రతి మూడు నెలలకోసారి అతని బాగోగులకు సంబంధించిన వివరాలను పంపిస్తామని ఇటలీకి చెందిన ఏజెన్సీ ప్రతినిధి ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. అయితే ఇటలీ దంపతులు దత్తత తీసుకుంటున్నందున వారితో వెల్లేందుకు సుముఖంగా ఉన్నావా అని సదరు బాలున్ని కలెక్టర్ ప్రశ్నించగా ఆయన సిద్దంగా ఉన్నానని చెప్పారు. అయితే తరుచూ బాలునితో మాట్లాడుతూ అతని యోగ క్షేమాలపై ఆరా తీయాలని మహిళాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ గోపి ఆదేశించారు. ఈ దత్తత కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, సిబ్బంది శాంత, తిరుపతి, రాజు, తేజస్వీ, కవిత, రాజ్ కుమార్, రమేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page