దిశ దశ, కరీంనగర్:
ప్రజా ప్రతినిధిగా ఎన్నికై అక్రమ వసూళ్లకు పాల్పుడుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొ్ంటున్న సీతారాంపూర్ కార్పోరేటర్ జంగిలి సాగర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలెే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసిన పోెలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ పై వచ్చిన ఫిర్యాదులను అనుసరించి సాక్ష్యాధారాలు సేకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం పోలీసు కస్టడీలో ఉన్న సాగర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సాగర్ ఇంటి నుండి కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం వరకు అనుమానిత అంశాలపై సాగర్ ను ప్రశ్నించి అందుకు సంబంధించిన ఎవిడెన్సులను సేకరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.