డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి…

కరీంనగర్ వాసికి సైబర్ క్రిమినల్స్ వల…

దిశ దశ, హైదరాబాద్:

ఈవెంట్స్ నిర్వాహకుడు, సింగర్ అయిన ఓ వ్యక్తిని సైబర్ క్రిమినల్స్ గాలం వేశారు. వారి యాక్టివిటీ అంతా గమనించిన అతను మొదట్లో భయ పడిపోయాడు. చివరకు సైబర్ క్రిమినల్స్ తనకు గాలం వేస్తున్నారని గమనించి అలెర్ట్ అయ్యాడు. కరీంనగర్ సాయినగర్ కు చెందిన చిలువేరి శ్రీకాంత్ ఆదివారం ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నాడు. వేడుకలో ఈవెంట్ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న క్రమంలో అతనికి వాట్సప్ వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుండి కాల్ చేసిన వ్యక్తి ఈడీ కేసులో నీ పేరు నమోదయిందని మొత్తం 257 మంది జాబితాలో నీ పేరు కూడా ఉందని చెప్పాడు. నీ పేరిట లావాదేవీలు జరిగాయని మనీ లాండరింగ్ కేసులో నీవు కూడా ఉన్నావంటూ బెదిరింపులకు గురి చేశాడు. నీతో ఎవరూ ఉండకూడదు… నీవు ఒక్కడివే మాట్లాడాలి… నీపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆందోళనకు గురైన శ్రీకాంత్ సైబర్ క్రిమినల్స్ ఎవరైనా తన అకౌంట్స్, ఇతరాత్ర ఐడీలు హ్యాక్ చేసి తనను ఇరికించేందుకు కుట్ర పన్నారేమోనని ఆందోళనకు గురయ్యాడు. తరుచూ టూర్లు చేస్తూ ఉండే తన డాక్యూమెంట్లను సేకరించిన అగంతకులు వాటిని ఆధారం చేసుకుని నేరాలకు పాల్పడ్డారేమెనన్న ఆందోళనకు గురైన శ్రీకాంత్ వీడియో కాల్ ద్వారా అడుగుతున్న వ్యక్తి సమాధానలు చెప్తూనే ఉన్నాడు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకూ శ్రీకాంత్ ను డిజిటల్ అరెస్ట్ చేసిన అగంతకుడు భయాందోళనకు గురి చేస్తూ పలువురు అదికారులతో మాట్లాడిస్తున్నాని సీబీఐ అధికారులంటూ లైన్లోకి తీసుకుని మాట్లాడించాడు. భయభ్రంతులకు గురి చేస్తున్న అంగతకులు మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన పోలీసు ఆఫీసర్ దయానాయక్ పేరిట ఓ లేఖను కూడా అతనికి పంపించారు. సుప్రీం కోర్టులో న్యాయవాదిని పెట్టుకోవల్సి ఉంటుందని కూడా సలహా ఇచ్చిన అగంతకులు చివరకు రూ. 3 లక్షలు తమకు బదిలీ చేస్తే ఈడీ కేసు నీ పేరు తొలగిస్తామని చెప్పారు. దీంతో తనకు కాల్ చేసిన వారే సైబర్ క్రిమినల్స్ అని అనుమానించిన శ్రీకాంత్ వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సైబర్ క్రిమినల్స్ వలలో పడకుండా తప్పించుకున్నాడు.

లేఖలు సృష్టించి…

సైబర్ క్రిమినల్స్ లేఖలు సృష్టించిన తీరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ECIR/MBZ0_I/02/2025, 20.04.2025న ఈడీ అధికారులు కేసు నమోదు చేసినట్టుగా ఓ నఖలు ప్రతిని కూడా పంపించారు. అరెస్ట్ ఆర్డర్ పేరిట విడుదల అయిన ఈ లేఖలో ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) యాక్ట్ 2002 (15 OF 2003) ద్వారా అరెస్ట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈడీ అసిస్టెంట్ డైరక్టర్, ముంబాయి డైరక్టర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ నీరజ్ కుమార్ పేరిట ECIR పంపించారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు పేరిట ఫ్రీజ్ ఆర్డర్ కూడా శ్రీకాంత్ కు పంపించారు. సీబీఐ అధికారులు కూడ కేసు నమోదు చేసినట్టుగా FIR N0: MH/5621/0225 పేర్కొన్న అగంతకులు మనీ లాండరింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, ఐడెంటిటీ థెప్ట్ కేసుల్లో శ్రీకాంత్ పేరు ఉన్నట్టుగా మరో లేఖను కూడా పంపించారు.

సైబర్ క్రిమినల్స్ ఎలా వ్యవహరించారో వివరిస్తున్న శ్రీకాంత్. వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి: 

You cannot copy content of this page