పాశుపతాస్త్రమేనా..?

సెక్షన్ 91పై భిన్నాభిప్రాయాలు

సీబీఐ అధికారులు తమ అమ్ముల పొదిలో ఉన్న 91 సీఆర్పీసీ ఆధారంగా కవితకు ఇచ్చిన నోటీసులు పాశుపతాస్త్రంగా మారుతాయా..? వాంగ్మూలం సేకరించిన నేఫథ్యంలో ఆమెకు మరోసారి ఇచ్చిన నోటీసుల వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? లిక్కర్ స్కాంలో బీఆరెఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు వెలుగులోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. అయితే సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేకపోవడంతో అంతా వట్టిదేనని కావాలనే కవితను ఈ వ్యవహారంలోకి లాగారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత అమిత్ అరోరాను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు కవిత పేరును కూడా చేర్చడంతో పాటు ఆమె రెండు నెంబర్లను వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసిందని కూడా ఆ వాంగ్మూలం ద్వారా కోర్టుకు అందించారు. దీని ఆధారంగా సీబీఐ విచారించేందుకు రంగంతోకి దిగి 160 ప్రకారం సాక్షిగా విచారించారు. ఆదివారం కవిత నివాసంలో విచారణ జరిపిన కొన్ని గంగల్లోనే సీబీఐ అధికారులు సెక్షన్ 91 సీఆర్పీసీ ప్రకారం మరో నోటీసు ఇవ్వడం గమనార్హం. తమ దర్యాప్తుకు అవసరమైన ఆధారాలు, డాక్యూమెంట్లు, మెటిరియల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవితకు మరో నోటీసు ఇచ్చారు అధికారులు.

నోటీసుపై భిన్నాభిప్రాయాలు…

అయితే 91 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం ఇచ్చిన నోటీసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కవితకు ఈ నోటీసు ఇవ్వడం రాజ్యంగ విరుద్దమంటూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రాజ్యంగంలోని ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 2 ప్రకారం సీబీఐ ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ క్లాజ్ ను దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు కోర్టులు వ్యాఖ్యానించిన అంశంతో పాటు నిపుణులు కూడా తప్పు పట్టిన సందర్భాలు లేకపోలేదు. దీంతో కవితకు ఇచ్చిన 91 సీఆర్పీసీ సెక్షన్ నోటీసును హై కోర్టు రద్దు చేసినట్టయితే సీబీఐ సుప్రీం కోర్టుకు వెల్లే అవకాశం లేకపోలేదు. తాము ఇదంతా కూడా ప్రొసిజర్ ప్రకారమే చేసుకుంటూ వెల్తున్నామని సీబీఐ అధికారులు వాదించే అవకాశం లేకపోలేదు. ఇదంతా కూడా విచారణలో భాగంగానే చేస్తున్నారని, 160 స్టేట్ మెంట్ నమోదు చేసుకున్న తరువాత దర్యాప్తు చేసే అధికారులు 91 సీఆర్సీసీ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలని నిభందనలు చెప్తున్నాయని వివరించనున్నారు. కవిత తన వద్ద ఉన్న డాక్యూమెంట్ ఎవిడెన్స్ అయినా ఇతరాత్ర ఆధారాలే అయినా సీబీఐకి సమర్పించకున్నా లోతుగా ఆరా తీయాలని భావిస్తే మాత్రం విచారణ యథావిధిగా ముందుకు సాగనుందని స్పష్టం అవుతోంది.

టెక్నికల్ ఎవిడెన్స్…

అమిత్ అరోరాను కస్టడీలోకి తీసుకున్న తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయని అంటున్న సీబీఐ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించనుంది. అరోరా స్టేట్ మెంట్ ఆధారంగా కవిత రెండు నెంబర్లను వినియోగిస్తున్నారని 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని సీబీఐ అధికారులు ఐఎంఈఐ నెంబర్లను కూడా వివరిస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే సీబీఐ అధికారులు కేవలం కవిత వాంగ్మూలం తీసుకుని సంతృప్తి చెందుతారని నమ్మడానికి వీలు లేదని ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేసిన రిపోర్టు తేటతెల్లం చేస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని కవిత గురించి పూర్తి ఆధారాలే సేకరించేందుకు సీబీఐ సైబర్ వింగ్ ఇప్పటికే రంగంలోకి దిగి ఉంటుంది. ప్రైవేటు చాపర్ లో పర్యటించారన్న విషయాన్ని కూడా ఊటంకించిన సీబీఐ వాటి ఆధారంగా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించనుంది. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం నిపుణులు ఆరా తీసే పనిలో నిమగ్నం అయి ఉంటారన్నది నిజం. కేవలం కవిత అమిత్ అరోరాతో మాత్రమే ఫోన్లలో మాట్లాడారా..? ఈ కేసుకు సంబందించిన వారితో మాట్లాడారా..? ఆమెతో పాటు ఈ స్కాంలో ఎంతమందికి సంబంధాలు ఉంటాయి, ఆమె నేతృత్వంలో వేరే టీం ఉన్నట్టయితే వారెవరూ తదితర అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించి వాటిని కూడా కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

You cannot copy content of this page