న్యూఢిల్లీలో కవిత ప్రెస్ మీట్

మద్యాహ్నం ఒంటి గంటకు ఫిక్స్

ఎమ్మెల్సీ కవిత గురువారం మద్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ నుండి నోటీసులు అందుకున్న కవిత బుధవారం సాయంత్రం వరకు న్యాయనిపుణులతో చర్చలు జరిపి ఢిల్లీకి వెల్లిపోయారు. శుక్రవారం భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఒకరోజు నిరహార దీక్ష కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెల్లారు. అప్పటికే ఈడీ ఇచ్చిన నోటీసులకు తాను ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు. శనివారం అయితే విచారణకు వస్తానని చెప్పిన కవిత ఈడీ వైఖరిని తూర్పారబడుతూ ఓ ప్రకటన కూడా విడడుదల చేశారు. ఈ నేఫథ్యంలోనే గురువారం మద్యాహ్నం మీడియాతో మాట్లాడుతారని ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత కేంద్ర ప్రభుత్వ వైఖరిని తులనాడుతారా, జాతీయ దర్యాప్తు సంస్థల విధానాలను ఎండగడ్తారా, లేక లిక్కర్ స్కాంతో ఉన్న సంబంధాలపై క్లారిటీ ఇస్తారా అన్న విషయమే హాట్ టాపిక్ గా మారింది. లేక మహిళా బిల్లుకు సంబందించిన అంశాలపై కామెంట్స్ చేస్తారేమోనన్న చర్చలు సాగుతున్నాయి. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. జాతీయ మీడియా ముందు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టయితే ఈ అంశం నేషనల్ ఇష్యూ అవుతుందని అంచనా వేసి ఉంటారేమోనన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. కవిత మనసులో ఏముందో తెలియాలంటే మద్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూడాల్సిందే.

You cannot copy content of this page