ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు. ఈడీ అధికారులు విచారణకు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న పలువురిని ప్రశ్నించిన ఈడీ కవిత నుండి వివరాలను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిళ్లైతో పాటు మరికొంతమందిని కూడా ముఖాముఖిగా విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయిన పలువురు ఈడీ కస్టడీలో ఉన్నారు. మొదట లిక్కర్ స్కాంలో ఎలా ఎంటర్ అయ్యారు..? ఎవరి పాత్ర ఉంది…? తదితర పూర్తి వివరాలను సేకరించడంతో పాటు ఫేస్ యాప్ ద్వారా మాట్లాడిన అంశాలు, మొబైల్ ఫోన్లు పగలగొట్టిన విషయం, వాట్సప్ తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చేసిన ఛాటింగ్ తదితర పూర్తి వివరాల గురించి ఈడీ కవితను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాట్సప్ ఛాటింగ్స్ ఇప్పటికే డీ కోడ్ చేసిన ఈడీ ఆ కోణంలో కూడా కవితను అడగనున్నట్టు తెలుస్తోంది. అయితే కవిత మాత్రం సీబీఐ విచారణ ఎదుర్కొన్న విధంగానే గుండె ధైర్యంతో సమాధానాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇంటారాగేషన్ లో ఎక్స్ పర్ట్స్ అయిన అధికారుల ద్వారా ఆర్థిక లావా దేవీలు, సౌత్ గ్రూప్ భాగస్వామ్యం వంటి విషయాలపై లోతుగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post